గోల్డ్ రష్ : ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం వేట..

By AN Telugu  |  First Published Nov 28, 2020, 10:04 AM IST

ఉప్పాడ తీరంలో బంగారం కోసం స్థానిక మత్స్యకారులు వేట కొనసాగిస్తున్నారు. ఉప్పాడ శివారు పాత మార్కెట్‌ సమీపంలోని తీర ప్రాంతంలో రెండు రోజులుగా పసిడి వేట కొనసాగుతోంది. 

ఉప్పాడ తీరంలో బంగారం కోసం స్థానిక మత్స్యకారులు వేట కొనసాగిస్తున్నారు. ఉప్పాడ శివారు పాత మార్కెట్‌ సమీపంలోని తీర ప్రాంతంలో రెండు రోజులుగా పసిడి వేట కొనసాగుతోంది. 

శుక్రవారం కూడా స్థానిక మత్స్యకారులు బంగారం కోసం వెతికారు. మహిళలు, చిన్నారులు సైతం దువ్వెనలు, పుల్లలు, జల్లెళ్లలో ఇసుకను జల్లెడ పడుతున్నారు. 

Latest Videos

undefined

ఇప్పటికే మహిళలకు బంగారం రేణువులు, రూపులు, దిద్దులు, ఉంగారాలలో పాటు బంగారు, వెండి వస్తువులు లభ్యమయ్యాయి. గతంలో పెద్దపెద్ద బంగ్లాలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుపాన్‌ సమయాల్లో బయట పడుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.

ఈ వెతుకులాటలో ఒ​క మహిళకు బంగారు దిద్దులు దొరికాయి. ఇంకా బంగారు వస్తువులు దొరుకుతుండడంతో స్థానికులు ఈ ప్రాంతానికి పోటెత్తుతున్నారు. 
 
click me!