నెల్లూరు అపార్ట్‌మెంట్లో అగ్నిప్రమాదం: పలువురిని కాపాడిన ఫైర్ సిబ్బంది

Published : Apr 20, 2021, 10:03 AM ISTUpdated : Apr 20, 2021, 10:05 AM IST
నెల్లూరు అపార్ట్‌మెంట్లో అగ్నిప్రమాదం: పలువురిని కాపాడిన ఫైర్ సిబ్బంది

సారాంశం

నెల్లూరు జిల్లాలోని జోడిగాడితోటలోని ఓ అపార్ట్‌మెంట్ లో మంగళవారం నాడు ఉదయం  భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో పలువురు అపార్ట్ మెంట్ వాసులు చిక్కుకొన్నారు.


నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని జోడిగాడితోటలోని ఓ అపార్ట్‌మెంట్ లో మంగళవారం నాడు ఉదయం  భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో పలువురు అపార్ట్ మెంట్ వాసులు చిక్కుకొన్నారు.ఈ విషయం  తెలిసిన వెంటనే స్థానికులు  ఫైరింజన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మంటల్లో చిక్కుకొన్నవారిని  ఫైర్ ఫైటర్లు  సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.  మంటల ధాటికి తట్టుకోలేక  కొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని  అంబులెన్స్ లలో స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

ఈ అపార్ట్‌మెంట్ పక్కనే కెమికల్ గోడౌన్ ఉంది.  మంటలు కెమికల్ గోడౌన్ లోకి వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది జాగ్రత్తలు తీసుకొంటున్నారు. మూడు ఫైరింజన్లు  మంటలను ఆర్పుతున్నాయి.  అపార్ట్‌మెంట్ అగ్ని ప్రమాదానికి కారణాలపై  అధికారులు ఆరా తీస్తున్నారు.  ఈ అపార్ట్‌మెంట్ లో ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకొన్నారా లేదా  అనే విషయమై  అధికారులు ఆరా తీస్తున్నారు.  సార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకొందా  ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా  అనే విషయమై  ఫైర్ సిబ్బంది ఆరా తీస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?