అల్యూమినియం ఫ్లోరైడ్ గ్యాస్ లీక్: విశాఖ కంటైనర్ యార్డులో అగ్ని ప్రమాదం

By narsimha lodeFirst Published Jul 27, 2020, 3:19 PM IST
Highlights

విశాఖపట్టణం ఎయిర్‌పోర్టుకు సమీపంలోని కంటైనర్ యార్డులో సోమవారం నాడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. కంటైనర్ యార్డులో ఉన్న అల్యూమినియం ఫ్లోరైడ్ గ్యాస్ లీక్ కావడంతో మంటలు చేలరేగినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు.


విశాఖపట్టణం: విశాఖపట్టణం ఎయిర్‌పోర్టుకు సమీపంలోని కంటైనర్ యార్డులో సోమవారం నాడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. కంటైనర్ యార్డులో ఉన్న అల్యూమినియం ఫ్లోరైడ్ గ్యాస్ లీక్ కావడంతో మంటలు చేలరేగినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు.

మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి. విశాఖపట్టణంలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోలన చెందుతున్నారు.

also read:పరవాడ సాల్వెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత: మాజీ మంత్రి బండారు సహా విపక్ష నేతల అరెస్ట్

గ్యాస్ లీకై మంటలు వ్యాపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.  అక్కడే ఉన్న సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొన్నారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఈ ఘటనకు కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. గ్యాస్ లీక్ ఎలా జరిగిందనే విషయమై కూడ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. వరుస ఘటనలు విశాఖపట్టణంలో చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెల 13వ తేదీ రాత్రి పరవాడ సాల్వెంట్ ఫార్మా కంపెనీలో  ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అంతకు ముందు ఎల్జీ పాాలీమర్స్, సాయినార్ ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. ఈ ప్రమాదాలపై విపక్షలు ప్రభుత్వం తీరుపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.అయితే వరుస ప్రమాదాలపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అమర్ నాాథ్ అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

click me!