
అంబేద్కర్ కోనసీమ జిల్లా గొల్లవిల్లిలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. సంబరాల్లో భాగంగా బుధవారం వేసిన భోగి మంటలు అంటుకుని ముగ్గురు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరు మూడో తరగతి బాలికలు కాగా, ఒకరు ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారి. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో విద్యార్ధులకు చికిత్స అందిస్తున్నారు . దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.