దసరా వేడుకల్లో అపశృతి... రూ.50లక్షల ఆస్తి నష్టం

Published : Oct 09, 2019, 10:42 AM IST
దసరా వేడుకల్లో అపశృతి... రూ.50లక్షల ఆస్తి నష్టం

సారాంశం

కడపలోని బీకేఎం వీధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గోదాంలోని టీవీలు, ఫ్రిడ్జ్ లు, ఏసీ లు మంటలకు పూర్తిగా ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. 


దసరా వేడుకల్లో అపశృతి చోటుచేసుకొని దాదాపు రూ.50లక్షల ఆస్తి నష్టం నెలకొంది. ఈ సంఘటన కడపలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... దసరా వేడుకల్లో భాగంగా  మంగళవారం కడపలో దుర్గా మాతను ఊరేగించారు. ఈ ఊరేగింపులో భాగంగా భక్తులు బాణసంచా కాల్చారు.

ఆ సమయంలో నిప్పు రవ్వలు ఎగసిపడి.. ఓ గోదాంలోని అట్టపెట్టలపై పడ్డాయి. ఈ విషయాన్ని వెంటనే ఎవరూ గుర్తించకపోవడంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. గోదాం పూర్తిగా దగ్ధమైంది.

ఈ ఘటనలో దాదాపు రూ.50లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగింది. కడపలోని బీకేఎం వీధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గోదాంలోని టీవీలు, ఫ్రిడ్జ్ లు, ఏసీ లు మంటలకు పూర్తిగా ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

RK Roja Celebrate Kanuma GoPuja: కనుమ సందర్బంగాగోపూజ నిర్వహించిన ఆర్కె రోజా| Asianet News Telugu
Kethireddy Pedda Reddy Pressmeet: ఎక్క‌డైనా చర్చకు సిద్ధం జేసీకి పెద్దారెడ్డి స‌వాల్| Asianet Telugu