దిశ చట్టంపై అయేషా మీరా తండ్రి సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Dec 14, 2019, 5:35 PM IST
Highlights

అయేషా కేసులో మొత్తం ఆధారాలను నిర్వీర్యం చేశారని ఇక్బాల్ ఆరోపించారు. తాను ఒక టీచర్‌గా చెప్తున్నానని, ఏ చట్టం తీసుకువచ్చినా ఆడ పిల్లలకు న్యాయం జరగదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ వాళ్ళు కేసును టేకప్ చేసి సంవత్సరం అవుతుందని, ఇంకా ఎంత కాలం ఉంటుందోనని సందేహం వ్యక్తం చేశారు. 

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దిశచట్టంపై సంచలన వ్యాఖ్యలు చేశారు అయేషా మీరా తండ్రి ఇక్బాల్ పాషా. దిశచట్టం బోగస్ అంటూ విమర్శలు చేశారు. 

రాజకీయాల కోసం చట్టాలు చేయవద్దని, ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయాలంటూ సూచించారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే 21 రోజుల్లోనే శిక్ష విధించడం సాధ్యం కాదంటూ స్పష్టం చేశారు. 

ఇకపోతే అయేషా మీరా రేప్, హత్య ఘటనకు సంబంధించి సీబీఐ రీ పోస్టుమార్టం చేయడంపై అయేషా మీరా తండ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాలన్నీ బూటకం అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

రాజకీయ నాయకులు అంతా డ్రామాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 12ఏళ్లుగా తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తున్నామని అయితే ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

అయేషా మీరా తల్లి వ్యాఖ్యలపై రోజా రియాక్షన్: అండగా ఉన్న నాపై......

సీబీఐ అధికారులు వచ్చి అయేషా షాంపిల్స్ తీసుకెళ్లారని తెలిపారు. సీబీఐ అధికారులు, నమూనాలు సేకరించడం తాను చూడలేదని చెప్పుకొచ్చారు. రీ పోస్టుమార్టంపై అధికారులు తనకు ఏమీ చెప్పలేదన్నారు. 

అయేషాపై దారుణం జరిగి 12 ఏళ్లు అవుతుందని ఇప్పుడు వచ్చి నమూనాలు తీసుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో అధికారులే చెప్పాలన్నారు. అయేషా కేసులో మాన్యూవల్‌గా విచారణ జరిపితే నిందితుల్ని సులభంగా గుర్తించవచ్చునంటూ పలు సూచనలు చేశారు. 

అయేషా కేసులో మొత్తం ఆధారాలను నిర్వీర్యం చేశారని ఇక్బాల్ ఆరోపించారు. తాను ఒక టీచర్‌గా చెప్తున్నానని, ఏ చట్టం తీసుకువచ్చినా ఆడ పిల్లలకు న్యాయం జరగదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ వాళ్ళు కేసును టేకప్ చేసి సంవత్సరం అవుతుందని, ఇంకా ఎంత కాలం ఉంటుందోనని సందేహం వ్యక్తం చేశారు. 

తాము సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఏం చేసినా ఆయేషా తిరిగి రాదన్నారు. తమకు న్యాయం జరగకపోయినా సమాజం కోసం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. అయేషా కేసులో న్యాయం జరిగితే ఇతర పిల్లలకు కూడా న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు వస్తుందని ఇక్బాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

నా బిడ్డని చంపిందెవరో రోజాకి తెలుసు.. ఆయేషా మీరా తల్లి సంచలన కామెంట్స్..

click me!