సత్యసాయి జిల్లా వైసీపీలో ముసలం : స్థల వివాదం నేపథ్యంలో కొట్టుకున్న కౌన్సెలర్లు, పోలీసులకు చేరిన వ్యవహారం

By Siva KodatiFirst Published Jan 13, 2023, 6:31 PM IST
Highlights

శ్రీసత్యసాయి జిల్లాలో వైసీపీ కౌన్సెలర్లు కొట్టుకున్నారు. దీంతో వీరిపై 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఛైర్‌పర్సన్ ఇంద్రజ. ఇంటి నిర్మాణం విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. 

శ్రీసత్యసాయి జిల్లా వైసీపీలో వివాదం ముదిరింది. వైసీపీ కౌన్సెలర్‌లపై 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఛైర్‌పర్సన్ ఇంద్రజ. మున్సిపాలిటీలోని 29వ వార్డులో స్థల వివాదం విషయంలో వైసీపీకి చెందిన కౌన్సెలర్స్ రోషన్, ఇర్షద్‌ కొట్టుకున్నారు. 29వ వార్డులో రోషన్ వలీ ఇంటి ఎదురుగా వున్న ప్రభుత్వ స్థలంలో 5వ వార్డ్ కౌన్సిలర్ ఇర్షద్ ఇళ్లు నిర్మిస్తున్నాడని అడ్డుకున్నాడు రోషన్. అయితే తన ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటావా అంటూ ఆగ్రహించి దాడికి దిగారు ఇర్షద్. 

ఇకపోతే.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్‌పై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతల మధ్య విబేధాలను గమనించి వైసీపీ అధిష్టానం.. వాటికి చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే  వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలపై సమీక్ష నిర్వహిస్తున్న క్రమంలో.. ఈ విబేధాలు తెరపైకి వచ్చాయి. ఇటీవల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతపురం జిల్లాలోని నియోజకవర్గాలపై సమీక్ష సందర్భంగా.. కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేక వర్గం నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

Also REad: ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్.. రంగంలోకి మంత్రి పెద్దిరెడ్డి..!

ఉరవకొండ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి వై విశ్వేశ్వర రెడ్డి, ఆయన తమ్ముడు వై మధుసూధన్‌రెడ్డిలు మధ్య విభేదాలు బయటపడ్డాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలోనే ఇరువురు వారి వారి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జోక్యం చేసుకున్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వారికి సర్దిచెప్పారు. మరోవైపు ఎమ్మెల్సీ యల్లారెడ్డిగారి శివరామిరెడ్డి కుమారుడు కూడా వచ్చే ఎన్నికల్లో ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఆయన కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 
 

click me!