త్రాగునీటి కోసం... వైసిపి-టిడిపి వర్గాల మధ్య గొడవ, ముగ్గురి పరిస్థితి విషమం

Arun Kumar P   | Asianet News
Published : May 30, 2020, 09:35 PM IST
త్రాగునీటి కోసం... వైసిపి-టిడిపి వర్గాల మధ్య గొడవ, ముగ్గురి పరిస్థితి విషమం

సారాంశం

కేవలం త్రాగు నీటి కోసం అధికార వైసిపి- ప్రతిపక్ష టిడిపి శ్రేణుల మధ్య గొడవ మొదలై పదుల సంఖ్యలో క్షతగాత్రులుగా మారిన దారుణ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. 

శ్రీకాకుళం: కేవలం త్రాగునీటి కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్- ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల కార్యకర్తలు పరస్పరం ఒకరిపై ఒకరు దాడికి పాల్పడిన విషాద సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఇరువర్గాల దాడిలో దాదాపు 25మంది తీవ్రంగా గాయపడగా వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది.

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాళి మండలం పందిగుంట గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొని వుంది. ఈ  నేపథ్యంలో నీటి కోళాయి విషయంలో చిన్నగా మొదలైన వివాదం పార్టీలుగా విడిపోయి దాడులకు పాల్పడే స్థాయికి చేరింది. అధికార వైసిపి- ప్రతిపక్ష టిడిపి లకు చెందిన రెండు వర్గాలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడుకున్నారు. 

read more  కిలోల కొద్ది బంగారం, వెండి... తెలంగాణ నుండి ఏపికి తరలిస్తూ పట్టుబడ్డ ముఠా

దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ గొడవలపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ప్రత్యేక బలగాలతో గ్రామానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. 

ఈ గొడవలో 25 మంది తీవ్రంగా గాయపడిన వారిని కోట బొమ్మాళి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వుండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని శ్రీకాకుళం జిల్లా ఆస్పత్రికి తరలించారు.  

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu