తిరుమల అలిపిరి నడకమార్గంలో ఐదో చిరుత బోనులో చిక్కింది. ఆపరేషన్ చిరుతలో భాగంగా ఇది పట్టుబడింది.
తిరుమల : తిరుమల అలిపిరి నడకమార్గంలో ఐదో చిరుతను గురువారం అటవీశాఖ అధికారులు బంధించారు. నరసింహస్వామి ఆలయం, ఏడవకు మైలు రాయి మధ్యలో అటవీశాఖ అధికారులు చిరుతను ట్రాప్ చేశారు. నాలుగు రోజుల క్రితమే ట్రాప్ కెమెరాకు చిక్కిన చిరుత కోసం బోన్లు ఏర్పాటు చేశారు. ఈ బోన్లో చిరుత చిక్కింది.
దీంతో ఆపరేషన్ చిరుత విజయవంతం అయినట్టే. సెప్టెంబర్ 7న నాలుగో చిరుత చిక్కింది. ఇప్పుడు 5వ చిరుత చిక్కింది. జూలైలో 3 చిరుతలను అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం చిక్కిన చిరుత వయసు సుమారు 10 సంవత్సరాలు. ఇప్పటివరకు చిక్కిన చరిత్రలో ఇదే అతి పెద్దది అని తెలుస్తోంది.
నెల్లూరు జిల్లాకు చెందిన ఓ చిన్నారి చిరుత దాడిలో మృతి చెందడంతో కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మరో చిన్నారిపై కూడా దాడి జరగగా.. తిరుమట అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. చిరుతలను బంధించారు.