కానిస్టేబుల్ నీలవేణిది ఆత్మహత్య కాదు.. హత్య, భర్తే హంతకుడు: నిజం తేల్చిన పోలీసులు

Siva Kodati |  
Published : May 31, 2020, 06:34 PM IST
కానిస్టేబుల్ నీలవేణిది ఆత్మహత్య కాదు.. హత్య, భర్తే హంతకుడు: నిజం తేల్చిన పోలీసులు

సారాంశం

కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ నీలవేణి అనుమానాస్పద మృతి కేసులను పోలీసులు ఛేదించారు. తొలుత దీనిని ఆత్మహత్యగా భావించిన పోలీసులు.. దర్యాప్తు అనంతరం హత్యగా నిర్ధారించారు

కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ నీలవేణి అనుమానాస్పద మృతి కేసులను పోలీసులు ఛేదించారు. తొలుత దీనిని ఆత్మహత్యగా భావించిన పోలీసులు.. దర్యాప్తు అనంతరం హత్యగా నిర్ధారించారు.

భర్త నాగశేషు, మరిది శ్రీనివాస్ కలిసి నీలవేణిని హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. వివరాల్లోకి వెళితే.. కొండపల్లి గ్రామానికి చెందిన మద్ది నీలవేణి కంచికచర్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది.

Also Read:స్టూడెండ్ వార్ కాదది: రూ.2 కోట్ల విలువైన ల్యాండ్ కోసం, హత్యలకు స్కెచ్

చీమలపాడుకు చెందిన పీ. నాగశేషు కూడా అదే కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. నీలవేణిని అతను ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ప్రస్తుతం మూడు నెలల కుమారుడు కూడా ఉన్నాడు.

ఈ క్రమంలో నీలవేణిపై అనుమానం పెంచుకున్న నాగశేషు ఆమెను గత కొంతకాలంగా అనుమానిస్తున్నాడు. ఈ అనుమానం పెనుభూతమై చివరికి భార్యను అంతమొందించాలని అతను కుట్రపన్నాడు.

Also Read:విశాఖలో విషాదం: స్పిరిట్ తాగి ముగ్గురు మృతి

పథకంలో భాగంగా శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన తమ్ముడు శ్రీనివాస్ సాయంతో నీలవేణిని హతమార్చాడు. అనంతరం హత్య తన మీదకు రాకుండా ఉండేందుకు గాను భార్య ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కట్టుకథ అల్లాడు.

పోలీసులు విచారణలో అసలు నిజం బయటపడటంతో నాగశేషు, శ్రీనివాస్ నేరాన్ని అంగీకరించారు. దీంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu