కన్నకూతురిపై పలుమార్లు అత్యాచారం.. తండ్రికి 20 యేళ్ల జైలుశిక్ష..

By SumaBala Bukka  |  First Published Jul 20, 2022, 7:18 AM IST

ఓ కామాంధుడికి కోర్టు 20యేళ్ల జైలుశిక్ష విధించిన ఘటన విశాఖపట్నంలో జరిగింది. కన్న కూతురిమీదే పలుమార్లు అత్యాచారం చేసిన ఆ కీచకుడికి కోర్టు ఈ మేరకు శిక్ష విధించింది. 


విశాఖపట్నం : కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి కుమార్తె మీద పలుసార్లు అత్యాచారం జరిపాడు. ఈ నేరం రుజువు కావడంతో తండ్రికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.100 జరిమానా విధించింది. ఈమేరకు పోక్సో చట్టం కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి కె. రామశ్రీనివాసరావు తీర్పునిచ్చారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం  కృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం, కిటుముల పంచాయితీ, బౌడ గ్రామానికి చెందిన  బాలిక (14) సమీపంలోని ఓ స్కూల్లో 8 వ తరగతి చదువుతుంది. అక్కడి హాస్టల్ లోనే ఉండేది. ఆమె తండ్రి కూలీ పనులు చేసేవాడు. నిత్యం భార్య, కూతురిని అనుమానిస్తూ తిడుతుండేవాడు.

స్కూల్లో చదువుతున్న కుమార్తెను ప్రతివారం ఇంటికి తీసుకువచ్చి బెదిరించి అత్యాచారం చేసేవాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు.. దీంతో బాలిక భయపడి మౌనంగా ఉండిపోయింది. ఈ క్రమంలో 2019 సెప్టెంబర్ 3న హాస్టల్ నుంచి కుమార్తెను ఇంటికి తీసుకువచ్చాడు. కుటుంబ సభ్యులు అందరూ  బయటకు వెళ్లడంతో, ఇంట్లో ఎవరు లేకపోవడంతో  కూతురి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బయటికి వెళ్ళిన భార్య  ఏదో పని మీద  వెంటనే వెనక్కి రావడంతో  జరుగుతున్నఘోరాన్ని చూసింది. షాక్ కు గురయింది. భర్తతో గొడవ పెట్టుకుంది. కుమార్తెను తీసుకుని చింతపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.

Latest Videos

undefined

టిండర్ పరిచయమైన మహిళపై అత్యాచారం.. భారతీయ సంతతి వైద్యుడికి యూకేలో జైలుశిక్ష..

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఖమ్మంలో ఏప్రిల్ 15న జరిగింది.  కామంతో కళ్లు మూసుకుపోయిన నిందితులు చిన్నారులకు చాక్లెట్లో, తినే వస్తువులో ఆశచూపి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అలా ఓ బాలికకు పుట్నాలు ఆశచూపి అత్యాచారయత్నం చేయబోయాడో నిందితుడు. అలా ఓ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి 20 ఏళ్ల  జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం సెకండ్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ సెషన్స్ కోర్టు (పోస్కో-2) న్యాయమూర్తి మహమ్మద్ అఫ్రోజ్ అక్తర్ బుధవారం తీర్పు చెప్పారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం పెద్ద బీరవల్లి గ్రామానికి చెందిన ఫిర్యాదికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. వారిద్దరూ మైనర్లు. కాగా ఆమె రోజు కూలీ పనులకు పోతూ ఉండేది.  ఈ క్రమంలోనే 2020 జూలై 25న తన పిల్లలను ఇంటి వద్ద ఉంచి రోజూలాగే కూలిపనులకు వెళ్లింది. 

ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన బొల్లె పోగు వెంకటేశ్వర్లు ఇంటి ఎదుట ఆడుకుంటున్న బాలికకు  పుట్నాలు పెడతానని చెప్పి తన ఇంటికి తీసుకువెళ్లి తలుపులు వేసి బాలికపై అత్యాచారయత్నం చేయబోయాడు.దీనిని గమనించిన చుట్టుపక్కల వారు నిందితుడి ఇంటికి వెళ్లి.. కేకలు వేసి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.. అని బాలిక తల్లి అప్పట్లో బోనకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దానిపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా ఆ కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడిపై నేరం రుజువు కావడంతో అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

click me!