కృష్ణా జిల్లాలో అల్లుడిని కత్తితో దాడి చేసి హతమార్చిన మామ

Published : Oct 14, 2021, 02:51 PM ISTUpdated : Oct 14, 2021, 02:54 PM IST
కృష్ణా జిల్లాలో అల్లుడిని కత్తితో దాడి చేసి హతమార్చిన మామ

సారాంశం

కృష్ణా జిల్ల అవనిగడ్డ నియోజకవర్గం కొడూరులో దారఉణం జరిగింది. అల్లుడిని ఓ మామ కత్తితో దాడి చేసి హతమార్చాడు. కత్తితో దాడి చేసిన తర్వాత కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా పారిపోయాడు. ఆయనను హాస్పిటల్ తీసుకెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు రంగప్రవేశం చేశారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.  

అమరావతి: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో దారుణం చోటుచేసుకుంది. కోడూరులో ఓ మామ అల్లుడిని knifeతో దాడి చంపేశాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న Policeలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం Avanigadda ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. 

Also Read: చాక్లెట్ల ఆశ చూపి.. మైనర్ బాలికలపై లైంగిక దాడి.. గట్టిగా అరవడంతో...

Krishna జిల్లా కోడూరులో ఆరో నెంబర్ పంట కాలవ మార్గంలో అల్లుడు ఎస్ హరికృష్ణ, అతని మామ నడుస్తూ  వెళ్తున్నారు. ఏదో విషయంపై వీరిద్దరూ గొడవపడ్డారు. వెంటనే హరికృష్ణపై మామ కత్తి తీసి దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హరికృష్ణను హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేశారు. కానీ, ఆయన హాస్పిటల్ చేరకముందే మార్గమధ్యంలోనే మరణించాడు. కాగా, అవనిగడ్డ సీఐ రవికుమార్, కోడూరు ఎస్‌ఐ నాగరాజు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. Post Mortem నివేదిక కోసం హరికృష్ణ మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ హాస్పిటల్‌కు పోలీసులు తరలించారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్