కోడలితో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్నాడని ఆమెతో కలిసి కొడుకు హత్య..

Published : Aug 03, 2021, 09:36 AM IST
కోడలితో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్నాడని ఆమెతో కలిసి కొడుకు హత్య..

సారాంశం

కోడలితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన తండ్రి ఆమెతో కలిసి కొడుకును హత్యచేశాడు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది.

ప్రకాశం : సమాజంలో అక్రమసంబంధాలు, వివాహేతర సంబంధాలు మితిమీరిపోతున్నాయి. క్షణిక సుఖాలకు ఆశపడి అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. వావివరసలు మరిచి శారీరక సుఖాల కోసం వెంపర్లాడడం.. ఆ బంధంలో కూరుకుపోయి బైటికి రాలేక.. ఆత్మహత్యలకు పాల్పడేవారు కొందరైతే.. అశాశ్వతమైన ఆ బంధం కోసం అడ్డుగా ఉన్నారని.. కట్టుకున్నవాళ్లను, కడుపున పుట్టిన వాళ్లను దారుణంగా హతమారుస్తున్నవారు మరికొందరు. అలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో జరిగింది. స్థానికంగా కలకలం రేపింది. 

కోడలితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన తండ్రి ఆమెతో కలిసి కొడుకును హత్యచేశాడు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. అద్దంకి సీఐ రాజేష్, ఎస్సై వి.శివన్నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏల్చూరు ఎస్సీ కాలనీకి కరుణయ్య, మరియమ్మ భార్యభర్తలు. వీరి కుమారుడు లక్ష్మయ్య (35)కు గుంటూరు జిల్ల వినుకొండకు చెందిన సునీతకు పద్దెనిమిదేళ్ల క్రితం వివాహమయ్యింది. 

వీరికి ఇద్దరు మగ పిల్లలున్నారు. మరియమ్మ, ముప్పై యేళ్ల క్రితమే చనిపోయింది. లక్ష్మయ్య మద్యానికి బానిసై ఆ మత్తులో ఉండేవాడు. ఈ క్రమంలో మామ కరుణయ్య, కోడలు సునీతకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. 

తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని లక్ష్మయ్యను హత్య చేసేందుకు వారు కుట్ర పన్నారు. వేసిన పథకం ప్రకారం ఆదివారం అర్థరాత్రి దాటాక.. గాఢ నిద్రలో ఉన్న లక్ష్మయ్యపై మారణాయుధాలతో దాడి చేసి చంపారు. ఈ దారుణాన్ని కళ్లారా చూసిన మృతుడి పెద్ద కుమారుడి వల్ల విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu