భార్యలు వదిలేశారు.. 14 యేళ్ల కుమార్తె ఒంటరిగా ఉండడంతో.. తండ్రి, బాబాయి అత్యాచారం...

Published : Feb 12, 2022, 08:20 AM IST
భార్యలు వదిలేశారు.. 14 యేళ్ల కుమార్తె ఒంటరిగా ఉండడంతో.. తండ్రి, బాబాయి అత్యాచారం...

సారాంశం

తాడేపల్లిగూడెంలో దారుణ ఘటన వెలుగుచూసింది. సొంత కూతురిమీదే ఓ తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనికి బాబాయి కూడా తోడయ్యాడు. కాపాడాల్సిన తండ్రే కాటేస్తుంటే.. కన్నకూతుర్లా చూసుకోవాల్సిన బాబాయే బరి తెగిస్తుంటే.. ఆ చిన్నారి ఎవరికీ చెప్పుకోలేక అల్లాడిపోయింది. వివరాల్లోకి వెడితే...

తాడేపల్లిగూడెం : పశ్చిమగోదావరి జిల్లా Thadepalligudem మండలం లోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు brothers వ్యవహార శైలి సరిగా లేకపోవడంతో wifeలు వారిని విడిచి పుట్టింటికి వెళ్ళిపోయారు.పెద్ద సోదరుడు కుమార్తె  (14) వారి వద్దే ఉంటుంది. అయితే, అన్నదమ్ములు ఇద్దరు ఒకరికి తెలియకుండా మరొకరు కొంతకాలంగా ఆ బాలికను బెదిరించి molestationకు పాల్పడుతున్నారు. 

ఈ విషయం ఎలాగో స్థానిక సచివాలయంలోని మహిళా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇంటికి వచ్చిన వారు బాలికను ఆరా తీయగా విషయం బయటకు వచ్చింది. వెంటనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాలికను రెస్క్యూ హోం కు తరలించారు. 

ఇలాంటి ఘటనే తాడేపల్లిలో.. జనవరి 6న వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి liquor మత్తులో minor అయిన కన్న కూతురిపై రెండోసారి rapeకి పాల్పడిన ఘటన వెలుగు చూసింది.  పోలీసుల కథనం ప్రకారం uttarpradesh నుంచి 12 ఏళ్ళక్రితం ఓ కుటుంబం తాడేపల్లికి వలస వచ్చి మహానాడు లోని ఓ కాలనీ లో ఉంటుంది. భర్త సీలింగ్ పనులు చేస్తుండగా... భార్య పిల్లలను చూసుకుంటూ ఇంటివద్దే ఉంటుంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు.

రెండో కుమార్తె వయసు పదకొండేళ్లు,  దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది.  తెల్లవారుజామున తండ్రి కూతురి మీద అత్యాచారానికి పాల్పడగా…  పెద్దగా కేకలు వేయడంతో నిద్రపోతున్న తల్లి లేచింది.  అక్కడి దృశ్యం చూసి పెద్దగా అరవడంతో భర్త పారిపోయాడు. మనస్థాపంతో బాలిక తల్లి ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతుండగా పెద్దకొడుకు అడ్డుకున్నాడు.  

ఆ తర్వాత స్థానికుల సలహాతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే భర్త ఇలా అఘాయిత్యానికి తెగడబడడం ఇది మొదటి సారి కాదని..  ఏడాది క్రితం తన భర్త కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడని  బయటికి చెబితే అందరిని చంపుతానని బెదిరించాడని ఆమె వాపోయింది. చేసిన తప్పు బంధువులకు తెలిసి నిలదీయడంతో క్షమాపణ కోరు తప్పించుకున్నాడని.. రెండోసారి మళ్లీ తప్పు చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.  బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో నిరుడు నవంబర్ లో జరిగింది. దీనిమీద ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రైచ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తన Minor daughter మీద అత్యాచారం చేసిన 40 యేళ్ల కీచక తండ్రికి మరణశిక్ష విధిస్తూ Bahraich Court తీర్పు చెప్పింది. సంఘటన జరిగిన తరువాత మూడు నెలల లోపు తండ్రిని దోషిగా నిర్ధారించిన కోర్టు అదనపు సెషన్స్ జడ్జి నితిన్ కుమార్ పాండే శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని ప్రత్యేక జిల్లా ప్రభుత్వ న్యాయవాది సంత్ ప్రతాప్ సింగ్ చెప్పారు. 

మైనర్ కుమార్తెకు పెళ్లి చేశాక కూడా, ఆమెను ఇంటికి తీసుకువచ్చి అత్యాచారం చేశాడని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. 14యేళ్ల బాధిత బాలిక మీద సాక్షాత్తూ తండ్రి అత్యాచారం చేస్తుండగా బాలిక భర్త పట్టుకుని కేసు పెట్టాడు. గత రెండేళ్లుగా తండ్రి అత్యాచారం చేస్తున్నా బెదిరించడంతో బాధితురాలు మౌనంగా ఉన్నట్లు కోర్టుకు తెలిపింది. 

Victimపాటు ఆమె కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టంలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. దోషికి Death sentenceతో పాటు 51వేల రూపాయల జరిమానా కూడా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu