సవతి కూతురు స్నానం చేస్తుండగా.. వీడియో తీసిన వ్యక్తి.. భార్య గమనించడంతో...

Published : Feb 12, 2022, 06:30 AM IST
సవతి కూతురు స్నానం చేస్తుండగా.. వీడియో తీసిన వ్యక్తి.. భార్య గమనించడంతో...

సారాంశం

విజయవాడలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయి.. వావివరసలు మరిచి వ్యవహరిస్తున్నా కామాంధులు. నమ్మి, తమకు రక్షణ కల్పిస్తాడనుకున్న వ్యక్తే ఆ బాలిక విషయంలో దారుణంగా వ్యవహరించాడు. సవతి కూతురు స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. అది భార్య కంట పడింది. 

విజయవాడ : వావి వరసలు మరిచి కూతురు వరసైన బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించాడో సవతి తండ్రి. Bathroomలో రహస్యంగా  phone పెట్టి ఆ అమ్మాయి స్నానం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించాడు. ఫోన్ లో video గమనించిన తల్లి Second husband  వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసి..  పోలీసులను ఆశ్రయించింది.  పోలీసుల కథనం ప్రకారం.. వన్ టౌన్  గట్టు వెనక ప్రాంతానికి చెందిన ఒక మహిళకు కొడుకు, కూతురు. కూతురు 9వ తరగతి చదువుతుంది. భర్తతో విభేదాల కారణంగా... అతనితో విడిపోయి రెండో వివాహం చేసుకుంది. 

రెండో భర్త, పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 4న... 9:30 గంటల సమయంలో ఇంట్లోని బాత్రూంలో ఫోన్ లో వీడియో ఆన్ చేసి బాత్రూంలో రహస్యంగా పెట్టాడు రెండో భర్త. ఆ తరువాత స్నానానికి వెళ్లిన బాలిక వీడియో అందులో రికార్డ్ అయ్యింది. గురువారం ఉదయం పది గంటల సమయంలో మహిళ తన రెండు భర్త ఫోన్ లో... ఫోటోలు చూస్తుండగా కూతురు స్నానం చేస్తున్న వీడియో కనిపించింది. ఈ విషయమై రెండో భర్తతో గొడవ పడింది. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇలాంటా దారుణఘటనే జనవరి 19న ఫూనేలో వెలుగుచూసింది. Puneలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరదలు స్నానం చేస్తుండగా video తీసి blackmail చేశాడు. ఆమెపై దాడిచేసి.. కామవాంఛ తీర్చుకున్నాడు. అతనిమీద పోలీసులు కేసు నమోదు చేశారు. అతను ఆమెను తన కోరిక తీర్చమంటూ బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా, కొట్టి, forcefully ఆమెను లొంగదీసుకున్నాడు. దీంతో ఆగితే.. విషయం వెలుగులోకి రాకపోయేది. కానీ అతను తిరిగి మళ్లీ అదే బుద్ది చూపిస్తుండడంతో.. సదరు victim పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదయ్యింది. 

పూనెలోని పర్భానీ జిల్లాకు చెందిన నిందితుడిపై బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా హింజేవాడి పోలీసులకు case నమోదు చేసినట్లు సమాచారం. కొంతకాలం క్రితం ఆమె స్నానం చేస్తుండగా నిందితుడు.. తనకు తెలియకుండా వీడియో చిత్రీకరించాడని, ఆ తర్వాత ఆ వీడియో క్లిప్‌ని చూపించి.. తనతో సంబంధం పెట్టుకోమని, తన కోరిక తీర్చమని కోరుతూ బ్లాక్‌మెయిల్ చేశాడని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.

ఆమె దీనికి నిరాకరించడంతో అతను వేధించడం ఇంకా ఎక్కువ చేశాడు. ఎంతకీ ఆమె లొంగకపోవడంతో.. అతను ఆమెను కొట్టి బలవంతంగా.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన గత నెలలో జరిగింది. అప్పటికి ఈ విషయాన్ని ఆమె భయంతో ఎవ్వరికీ చెప్పలేదు. 

అయితే, ఆ వ్యక్తి తనను మరోసారి వేధించడం ప్రారంభించే సరికి ఆమెకు ఏం చేయాలో పాలు పోలేదు. దీంతో ఆ మహిళ జరిగిన ఘోరాన్ని తన భర్తకు  వివరించింది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పోలీసులకు సమాచారం అందించారు. అలా అతని మీద కేసు నమోదు చేశారు.

అయితే పోలీసులు అతడిని పట్టుకునేలోపే నిందితుడు పర్భానీ జిల్లాలోని తన స్వగ్రామానికి పారిపోయాడు. దీనిమీద పోలీసులు మాట్లాడుతూ.. "మేము అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (అత్యాచారానికి శిక్ష,  323 (స్వచ్ఛందంగా గాయపరిచినందుకు శిక్ష) కింద కేసు నమోదు చేసాం" అని పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu