అప్పులబాధతో మనస్తాపం.. పురుగుల మందు తాగిన కుటుంబం..ఇద్దరు మృతి, ఒకరు విషమం...

Published : Aug 26, 2023, 08:45 AM IST
అప్పులబాధతో మనస్తాపం.. పురుగుల మందు తాగిన కుటుంబం..ఇద్దరు మృతి, ఒకరు విషమం...

సారాంశం

అప్పులబాధతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగడంతో భార్య,భర్త మృతి చెందారు. కూతురి పరిస్థితి విషమంగా ఉంది. 

పెందుర్తి : ఆంధ్రప్రదేశ్లోని పెందుర్తిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో భార్యాభర్తలిద్దరూ మృతిచెందగా,  కూతురి పరిస్థితి విషమంగా ఉంది. వరలక్ష్మి పూజ చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకున్న ఓ కుటుంబం.. తీవ్ర మనస్థాపాన్ని తట్టుకోలేక గురువారం రోజు రాత్రి 11 గంటల సమయంలో పురుగుల మందు తాగింది.  

విశాఖ జిల్లా పెందుర్తి మండలం గొర్రెపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… స్థానికంగా కిరాణం దుకాణం నడుపుతున్న కల్లూరి సత్తిబాబు(57)కి,  భార్య  సూర్యకుమారి (48),  ఇద్దరు సంతానం ఉన్నారు. కూతురు నీలిమ(24),  కొడుకు సంతోష్ కుమార్.  సంతోష్ కుమార్  నగరంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. కూతురు నీలిమ డిగ్రీ చదువు పూర్తి చేసి  ఇంటి దగ్గరే ఉంటుంది.  

విమానంలో పరిచయం.. గోవాకు వెళ్లాక రిసార్ట్ చూసేందుకు రావాలని పిలిచి, పర్యాటకురాలిపై అత్యాచారం..

వ్యాపారం, కుటుంబ అవసరాల కోసం సత్తిబాబు పలుచోట్ల అప్పులు చేశాడు. కానీ వాటిని అనుకున్న సమయానికి తీర్చలేకపోయాడు. దీంతో అప్పుల వాళ్ళ ఒత్తిడి ఎక్కువయింది.  దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. గురువారం రాత్రి 11 సమయంలో ఈ నేపథ్యంలోనే సత్తిబాబు,  ఆయన భార్య సూర్య కుమారి, కూతురు నీలిమలు  పురుగుల మందు తాగారు.  ఆ తర్వాత సూర్యకుమారి గ్రామంలో ఉన్న తమ బంధువులకు ఫోన్ చేసి విషయం తెలిపింది. 

వెంటనే వారు గ్రామస్తులతో కలిసి సత్తిబాబు ఇంటికి వచ్చారు. ముగ్గురిని కేజీహెచ్ కు తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం సత్తిబాబు మృతి చెందాడు. మధ్యాహ్నం భార్య సూర్య కుమారి మృతి చెందింది. ప్రస్తుతం కుమార్తె నీలిమ పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు పోలీసులు వివరాలు తెలిపారు.  అయితే కొడుకు సంతోష్ కుమార్ ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో లేడు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే