ప్రకాశం జిల్లాలో విషాదం... భార్యాభర్తలు, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య

By Arun Kumar PFirst Published Mar 16, 2019, 8:27 AM IST
Highlights

ప్రకాశం జిల్లాలో విషాదం శుక్రవారం రాత్రి విషాద సంఘటన చోటుచేసుకుంది. వ్యాపారం  నిమిత్తం తీసుకున్న అప్పుల అంతకంతకు పెరిగి అప్పులిచ్చిన వారి నుండి ఒత్తిడి పెరగడంతో ఓ కుటుంబం దారుణ నిర్ణయం తీసుకుంది. భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు సంతానం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం గ్రామానికి చెందిన నాగరాజు, ఈశ్వరి భార్యాభర్తలు. వీరికి వైష్ణవి, వరలక్ష్మి ఇద్దరు సంతానం. అయితే ఉపాధి నిమిత్తం కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్లిన నాగరాజు అక్కడ ఓ హోటల్ నడిపేవాడు. ఈ క్రమంలో పెట్టుబడి నిమిత్తం తెలిసిన వారి  దగ్గర భారీగా అప్పులు చేశాడు. 

అయితే ఈ అప్పులు, వడ్డీలు అంతకంతకు పెరుగడం... వ్యాపారం సరిగ్గా జరగక పోవడంతో నాగరాజు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ఈ మధ్యకాలంలో అప్పులవారి బాధ మరీ ఎక్కువవడంతో శుక్రవారం కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. కుటుంబం మొత్తం రోజంతా బంధువులతో గడిపి రాత్రి ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఓ కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని తాగి సామూహికంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

ఇవాళ ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

click me!