కాంగ్రెస్‌కు మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ రాజీనామా (వీడియో)

Published : Feb 03, 2019, 01:34 PM ISTUpdated : Feb 03, 2019, 02:42 PM IST
కాంగ్రెస్‌కు మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ రాజీనామా (వీడియో)

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆదివారం కురుపాంలోని తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 45 ఏళ్ల తన రాజకీయ ప్రస్ధానంలో ఇవాళ పార్టీకి రాజీనామా చేయడం బాధాకరంగా ఉందన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయన్నారు. నైతిక విలువలు ఉన్నందునే ఇంతవరకు తాను ఏ పార్టీలోకి వెళ్లలేదన్నారు. పార్టీ వ్యతిరేక చర్యలపై తాను అధిష్టానానికి తెలియజేసినా ఇంతవరకు ఎలాంటి స్పందనా లేకపోవడం వల్ల మనస్తాపంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని కిశోర్ చంద్రదేవ్ తెలిపారు.

"

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే