రుణం ఎగవేత కేసు : జైలు నుంచి విడుద‌లైన మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత దంప‌తులు

Siva Kodati |  
Published : Sep 17, 2022, 10:00 PM IST
రుణం ఎగవేత కేసు : జైలు నుంచి విడుద‌లైన మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత దంప‌తులు

సారాంశం

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసిన కేసులో అరెస్ట్ అయి జైల్లో వున్న అర‌కు మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత, ఆమె భ‌ర్త కోటేశ్వ‌ర‌రావులు విడుదలయ్యారు. నిన్న వీరిద్దరికీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.   

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసిన కేసులో అరెస్ట్ అయి జైల్లో వున్న అర‌కు మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత, ఆమె భ‌ర్త కోటేశ్వ‌ర‌రావులు విడుదలయ్యారు. ఈ మేరకు శ‌నివారం సాయంత్రం వీరిద్దరూ చంచ‌ల్‌గూడ జైలు నుంచి విడుద‌ల‌య్యారు. కాగా.. నిన్న గీత దంపతులకు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. అలాగే సీబీఐ కోర్టు తీర్పు అమలును సైతం నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

ALso Read:బ్యాంకు రుణం ఎగవేత: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష

కాగా.. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో కొత్తపల్లి గీత దంపతులు రూ. 52 లక్షలు రుణం తీసుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి రుణం తీసుకుని ఎగవేసిన విషయమై బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ అధికారులు 2015 జూలై 11న చార్జీషీట్ దాఖలు చేశారు. చార్జీషీట్ లో పంజాబ్ నేషనల్ బ్యాంకు హైద్రాబాద్ కు చెందిన నేషనల్ బ్యాంక్ మిడ్ కార్పోరేషన్ బ్రాంచ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, అప్పటి బ్రాంచ్ మేనేజన్ బీకే జయ ప్రకాశం, అప్పటి జనరల్ మేనేజర్ కేకే అరవిందాక్షన్ తదితరులపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. బ్యాంకు నుండి రుణం పొందేందుకు నిందితులు పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసేందుకు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని  చార్జీషీట్ లో సీబీఐ పేర్కొంది. కొత్తపల్లి గీత, ఆమె భర్త రామకోటేశ్వరరావు వాస్తవాలను దాచారని సీబీఐ అధికారులు ఆరోపించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి