జేసీ దివాకర్ రెడ్డి సూట్ కేసులో రూ.6లక్షలు మాయం...

Published : Oct 14, 2019, 08:44 AM IST
జేసీ దివాకర్ రెడ్డి సూట్ కేసులో రూ.6లక్షలు మాయం...

సారాంశం

డ్రైవర్‌ గౌతమ్‌కు ఫోన్‌ చేసి కారులో ఉన్న సూట్ కేసు తెమ్మని చెప్పారు. డ్రైవర్‌ దాన్ని తెరిచిచూడగా అందులో రూ.2వేల నోట్లకట్టలు మూడు ఉన్నాయి. ఆ మొత్తం రూ.6లక్షలను డ్రైవర్‌ సీటు కింద దాచేసి.. సూట్‌కేసు తీసుకెళ్లి జేసీకి ఇచ్చాడు. భోజనం చేశాక నిద్రపోయి లేచిన జేసీ బ్రీఫ్‌ కేసి తెరిచి చూడగా డబ్బు కనిపించలేదు. 

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సూట్ కేసులో డబ్బు మాయమైంది. ఆయన సూట్ కేసులోని రూ.6లక్షలను కారు డ్రైవర్‌ కాజేశాడు. గవర్నరుపేట పోలీసులు అతన్ని ఆదివారం అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. జేసీ దివాకర్‌రెడ్డి ఈ నెల 11న హైదరాబాద్‌ నుంచి విమానంలో గన్నవరం వచ్చారు. 

అక్కడి నుంచి తన స్నేహితుడు త్యాగరాజు పంపిన కారులో గాంధీనగర్‌లోని ఐలాపురం హోటల్‌కు చేరుకున్న ఆయన అక్కడి నుంచి అదే కారులో సచివాలయానికి వెళ్లారు. అక్కడ పాస్‌పోర్టు సైజు ఫొటోలు అవసరం కావడంతో మాజీ పీఏని పిలిచి కారులో ఉన్న సూట్ కేసులోని ఫొటోలు తెప్పించుకున్నారు. ఫోటోలు తీసుకున్న తర్వాత ఆయన సూట్ కేసుకి తాళం వేయడం మర్చిపోయారు.

అక్కడ పని పూర్తయ్యాక జేసీ కారులో తిరిగి ఐలాపురం హోటల్‌కు చేరుకున్నారు.సూట్ కేసును కారులోనే మర్చిపోయి రూమ్‌కు వెళ్లారు. డ్రైవర్‌ గౌతమ్‌కు ఫోన్‌ చేసి కారులో ఉన్న సూట్ కేసు తెమ్మని చెప్పారు. డ్రైవర్‌ దాన్ని తెరిచిచూడగా అందులో రూ.2వేల నోట్లకట్టలు మూడు ఉన్నాయి. ఆ మొత్తం రూ.6లక్షలను డ్రైవర్‌ సీటు కింద దాచేసి.. సూట్‌కేసు తీసుకెళ్లి జేసీకి ఇచ్చాడు. భోజనం చేశాక నిద్రపోయి లేచిన జేసీ బ్రీఫ్‌ కేసి తెరిచి చూడగా డబ్బు కనిపించలేదు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్‌ గౌతమ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. సీటు కింద ఉన్న నగదు తీసి పోలీసులకు ఇచ్చేశాడు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్