బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి..?

By telugu teamFirst Published Oct 21, 2019, 7:47 AM IST
Highlights

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, అమరావతి ఫ్రీజోన్ వంటి డిమాండ్లకు బీజేపీ కూడా సానుకూలంగా ఉన్నందున సీమ అభివృద్దే లక్ష్యంగా బీజేపీలో చేరుతున్నట్టు బైరెడ్డి చెబుతున్నారు.

రాయలసీమలో కీలక రాజకీయ నాయకుల్లో ఒకరైన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై చర్చించేందుకు ఈ నెల 24న కర్నూలులోని బైరెడ్డి కన్వెన్షన్ హాల్ లో తన అనుచరులతో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. 

ఆ సందర్భంగా ఆయన భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించనున్నారు. బైరెడ్డి తరపున ఆయన సన్నిహితులు రెండు రోజుల నుంచి పలువురికి ఫోన్లు చేసి సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. తన అనుచరులను ఒప్పించి పక్కా ప్రణాళికతో బీజేపీలోకి అడుగుపెట్టాలని బైరెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం ప్రధాని మోదీని కలిసి రాయలసీమ అభివృద్ధి ప్రణాళికలను వివరించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, అమరావతి ఫ్రీజోన్ వంటి డిమాండ్లకు బీజేపీ కూడా సానుకూలంగా ఉన్నందున సీమ అభివృద్దే లక్ష్యంగా బీజేపీలో చేరుతున్నట్టు బైరెడ్డి చెబుతున్నారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇక టీడీపీ కోలుకోవడం అయ్యేపని కాదని ఆయన విశ్వసిస్తున్నారు. గతంలో బైరెడ్డి కుటుంబం కాంగ్రెస్‌లో ఉండేది. టీడీపీ వచ్చాక ఆ పార్టీలో చేరింది. రెండు సార్లు బైరెడ్డి నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాయలసీమ పరిరక్షణ సమితి ఏర్పాటుచేశారు. ఆ తర్వాత స్పందన లేకపోవడంతో దాన్ని మూసేశారు. కాంగ్రెస్‌లో చేరారు.

మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికారు. కానీ స్థానికంగా బైరెడ్డి ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు.

click me!