న్యాయమడిగితే ఈడ్చి కొట్టిస్తారా? మిమ్నల్ని మహిళలే నిషేధిస్తారు: జగన్ పై లోకేష్ వ్యాఖ్యలు

Published : Sep 28, 2019, 07:05 PM IST
న్యాయమడిగితే ఈడ్చి కొట్టిస్తారా? మిమ్నల్ని మహిళలే నిషేధిస్తారు: జగన్ పై లోకేష్ వ్యాఖ్యలు

సారాంశం

ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు వద్దు అని ఆందోళన చేసినందుకు మహిళలు అని కూడా చూడకుండా రోడ్డు మీదకు ఈడ్చి కొట్టిస్తారా? అంటూ ప్రశ్నించారు. మద్యపాన నిషేధం పేరుతో మోసం చేసిన మిమల్ని మహిళలు నిషేధించడం ఖాయం మంటూ నారా లోకేష్ తిట్టిపోశారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాబోయే రోజుల్లో జగన్ ను మహిళలే నిషేధిస్తారని శాపనార్థాలు పెట్టారు లోకేష్. 

పాదయాత్రలో సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు మాట తప్పుతున్నారని స్పష్టం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల మధ్యలోనే సారా దుకాణాలు తెరుస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

ఇంట్లో కాలేజ్ కి వెళ్లే అమ్మాయిలు ఉన్నారు, పిల్లలున్నారు, ఇక్కడ మద్యం దుకాణాలు వద్దు మహాప్రభో అని మహిళలు వేడుకుంటున్నా కనికరించరా అంటూ నిలదీశారు. ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు వద్దు అని ఆందోళన చేసినందుకు మహిళలు అని కూడా చూడకుండా రోడ్డు మీదకు ఈడ్చి కొట్టిస్తారా? అంటూ ప్రశ్నించారు. మద్యపాన నిషేధం పేరుతో మోసం చేసిన మిమల్ని మహిళలు నిషేధించడం ఖాయం మంటూ నారా లోకేష్ తిట్టిపోశారు. 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!