మాధవ్ వీడియో వ్యవహారం .. ‘‘అశ్లీలం’’తోనూ రాజకీయమా, ఇంతగా దిగజారాలా : బాబుపై పేర్ని నాని ఆగ్రహం

Siva Kodati |  
Published : Aug 18, 2022, 04:48 PM ISTUpdated : Aug 18, 2022, 04:49 PM IST
మాధవ్ వీడియో వ్యవహారం .. ‘‘అశ్లీలం’’తోనూ రాజకీయమా, ఇంతగా దిగజారాలా : బాబుపై పేర్ని నాని ఆగ్రహం

సారాంశం

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహారంపై స్పందించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. అశ్లీలాన్ని కూడా తన రాజకీయాలకు వాడుకుంటున్న వ్యక్తి చంద్రబాబని ఆయన ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం ఇంతగా బరితెగించాలా అని ఆయన ప్రశ్నించారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని (perni nani). గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు రాజకీయంగా ఎంతకైనా దిగజారతారని ప్రశ్నించారు. వ్యవస్థలను తన అవసరానికి వాడుకునే వ్యక్తి చంద్రబాబని నాని ఆరోపించారు. చంద్రబాబు తాను దిగజారుతూ పక్కవాళ్లను కూడా లాగుతున్నారని పేర్నినాని దుయ్యబట్టారు. అశ్లీలాన్ని కూడా తన రాజకీయాలకు వాడుకుంటున్న వ్యక్తి చంద్రబాబని ఆయన ఆరోపించారు. 

ఫేక్ వీడియోను సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారని పేర్నినాని ఆరోపించారు. నిత్యం అసత్య ప్రచారం చేయడమే చంద్రబాబు పని అని.. తనకు అనుకూలమైన వారితో కలిసి చంద్రబాబు కుట్రలకు తెరలేపుతున్నారని ఆయన ఆరోపించారు. అమెరికా సంస్థల్ని కూడా దిగజారుడు రాజకీయాల్లోకి లాగుతున్నారని.. అమెరికా సంస్థ ఇచ్చిందంటూ ఓ ఫేక్ రిపోర్టును ప్రచారం చేశారని పేర్నినాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఇంతగా బరితెగించాలా అని ఆయన ప్రశ్నించారు. 

ఇక అంతకుముందు హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వివరణ ఇచ్చారు. ఎంపీ మాధవ్ వీడియో వ్యవహారంలో తప్పుడు రిపోర్ట్‌తో ప్రచారం చేశారని ఆయన అన్నారు. అమెరికా ల్యాబ్ ఇచ్చినట్లు సర్క్యూలేట్ అవుతున్నది ఫేక్ రిపోర్ట్ అని సునీల్ కుమార్ స్పష్టం చేశారు. తాము అమెరికాలోని ఎక్లిప్స్ ల్యాబ్‌ను సంప్రదించామని.. తన పేరుతో ఎవరో ఫేక్ రిపోర్ట్ ఇచ్చారని ల్యాబ్ అధికారి జిమ్ ఈమెయిల్ ద్వారా తమకు సమాచారం అందించారని సీఐడీ చీఫ్ పేర్కొన్నారు. 

ALso REad:కులాలు, మతాలతో రాజకీయం.. నిత్యం ఏదో ఒక కుట్ర : చంద్రబాబుపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు

ఇదిలావుంటే... చంద్రబాబు నాయుడు (chandrababu naidu), తెలుగుదేశం పార్టీపై (telugu desam party) విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కొడాలి నాని (kodali nani) . గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు రోజూ ఏదో ఒక కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. గోరంట్ల మాధవ్‌పై ఫేక్ వీడియోతో కుట్ర చేశారని.. అదే వీడియోపై ఫోరెన్సిక్ రిపోర్ట్ అంటూ మరో కుట్ర చేశారని కొడాలి నాని ఆరోపించారు. మతాలపై దుష్ప్రచారం చేసిన వ్యక్తి చంద్రబాబని.. తన భార్యని తాము ఏదో అన్నామని చంద్రబాబు ఏడ్చారంటూ చురకలు వేశారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నీచ రాజకీయాలు చేశారని.. ప్రభుత్వంపై బురద జల్లేందుకు పనికిమాలిన రాజకీయం చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. 

ఆ డాక్యుమెంట్ ఫేక్ అని అమెరికాలోని ఎక్లిప్స్ ల్యాబ్ స్పష్టం చేసిందన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్ధితి లేదని.. కుల, మతాల పేరుతో చంద్రబాబు రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబుకు తోడు ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని.. అధికారం కోసం ఆయన దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని.. నీచ రాజకీయాలు చేస్తున్న ఆయనకు ప్రజలు మళ్లీ బుద్ధి చెబుతారని కొడాలి నాని అన్నారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ భజన చేస్తున్నారని.. రెండు చోట్లా ఓడిపోయినా పవన్‌కు బుద్ధి రాలేదని ఆయన ఎద్దేవా చేశారు. 

PREV
click me!

Recommended Stories

నేను మారాను నన్ను నమ్మండి అనడం చంద్రబాబు కి అలవాటే: Perni Nani Comments | YCP | Asianet News Telugu
మాస్క్ అడిగితె చంపేస్తారా? Varla Ramaiah Serious Comments on YS Jagan | Viral | Asianet News Telugu