మేం అప్పులు చేస్తుంటే.. కేంద్రం ఏం చేస్తోంది, మీకు తెలియకుండానేనా : జేపీ నడ్డాకి పేర్ని నాని కౌంటర్

Siva Kodati |  
Published : Jun 07, 2022, 08:35 PM ISTUpdated : Jun 07, 2022, 08:36 PM IST
మేం అప్పులు చేస్తుంటే.. కేంద్రం ఏం చేస్తోంది, మీకు తెలియకుండానేనా : జేపీ నడ్డాకి పేర్ని నాని కౌంటర్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పులపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. గోదావరి గర్జన సభలో నడ్డా చెప్పినవన్నీ అబద్ధాలేనంటూ నాని ఫైరయ్యారు. 

రాజమండ్రిలో (rajamahendravaram) జరిగిన గోదావరి గర్జన (bjp godavari gharjana) సభలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై (ysrcp govt)  బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (jp nadda) చేసిన  వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని (perni nani) . వేదికపై జేపీ నడ్డా నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ (polavaram project) గురించి ఒక్క మాటైనా చెప్పారా అని నాని ప్రశ్నించారు. పోలవరం పెండింగ్ బిల్లులు ఇంకా ఎందుకు ఇవ్వలేదని ఆయన నిలదీశారు. ఈడీ, ఐటీ దాడులతో ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతోంది ఎవరని పేర్ని నాని చురకలు వేశారు. ఏపీ అప్పులపై నడ్డా చెప్పింది అంతా తప్పేనని.. 130 లక్షల కోట్లకు దేశ అప్పును తీసుకుని వెళ్లింది ఎవరంటూ ఆయన ధ్వజమెత్తారు. 

నడ్డా ఏపీకి వచ్చే ముందు ఆర్ధిక మంత్రిని అడిగి వివరాలు తీసుకుని వస్తే బాగుండేదంటూ నాని సెటైర్లు వేశారు. తాము పరిమితికి మించి అప్పులు చేస్తే కేంద్రం ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. మోడీకి, ఆర్ధిక మంత్రికి తెలియకుండా అప్పులు తీసుకున్నామా  అంటూ పేర్ని నాని చురకలు వేశారు. ఆయుష్మాన్ భారత్ కింద పెట్టే రూల్స్ అమలు చేస్తే ఏపీలో ఒక్కరికీ ఆరోగ్యశ్రీ రాదని ఆయన ఆరోపించారు. దేశంలో మతం పేరుతో తన్నుకునేలా విధ్వంస రాజకీయాలు చేస్తోంది మీరు కాదా అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.

అంతకుముందు బీజేపీ  (bjp) జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (jp nadda) మాట్లాడుతూ.. మోడీ (narendra modi) హయాంలో దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందన్నారు. మోడీ దేశంలో అవినీతి రహిత పాలనను అందిస్తున్నారని జేపీ నడ్డా అన్నారు. దేశ సంస్కృతిని మోడీ మారుస్తున్నారని నడ్డా పేర్కొన్నారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని  ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ కవరేజ్ అయిన ఆయుష్మాన్ భవ కార్యక్రమం ద్వారా కోట్లాది మందికి సాయం చేస్తున్నారని... అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా కరోనాను నియంత్రించారని నడ్డా గుర్తుచేశారు. దేశంలో ఎయిమ్స్ సంఖ్యను మోడీ పెంచారని ఆయన పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్