ఏపీలో హంగ్ ఏర్పడే అవకాశం.. మాజీ మంత్రి

By ramya neerukondaFirst Published Nov 6, 2018, 4:27 PM IST
Highlights

త్వరలో ఏపీలో రానున్న ఎన్నికల్లో తాను పోటీచేయడం ఖాయమని స్పష్టం చేశారు. అయితే.. ఆ పోటీ కాంగ్రెస్ నుంచే అనిమాత్రం కచ్చితంగా చెప్పలేనన్నారు.


త్వరలో ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని మాజీ మంత్రి,  విశాఖ డీసీసీ అధ్యక్షుడు పసుపులేటి బాలరాజు అభిప్రాయపడ్డారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో  పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు చంద్రబాబు రాహుల్ గాంధీని కూడా కలిశారు. కాగా.. ఈ విషయంపై తాజాగా బాలరాజు మీడియాతో మాట్లాడారు.

టీడీపీ, కాంగ్రెస్ ల పొత్తు శాశ్వతం కాదన్నారు. పొత్తులు ఇలానే కొనసాగుతున్నాయని చెప్పలేమన్నారు. భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ చాలా మార్పులు చోటుచేసుకుంటాయన్నారు.  ప్రజా సమస్యలపై పాలక, ప్రతిపక్ష నేతలు దృష్టిసారించకపోవడాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని ఆయన అన్నారు.

టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఎలాంటి నష్టం లేదన్నారు. ఈ పొత్తుని వ్యతిరేకించే నేతలు అందుకు గల కారణాలు కూడా చెప్పాలి కదా అని ప్రశ్నించారు.  త్వరలో ఏపీలో రానున్న ఎన్నికల్లో తాను పోటీచేయడం ఖాయమని స్పష్టం చేశారు. అయితే.. ఆ పోటీ కాంగ్రెస్ నుంచే అనిమాత్రం కచ్చితంగా చెప్పలేనన్నారు. తాను పార్టీ మారే ఆలోచనలో ఉన్నానని చూచాయగా తెలియజేశారు. ఏ పార్టీలో కి వెళ్తున్నారనే విషయాన్ని మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచారు. 

click me!