మాజీ మంత్రి నారా లోకేష్ కి తృటిలో తప్పిన ప్రమాదం

Published : Dec 11, 2019, 09:42 AM ISTUpdated : Dec 11, 2019, 09:48 AM IST
మాజీ మంత్రి నారా లోకేష్ కి తృటిలో తప్పిన ప్రమాదం

సారాంశం

ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ మంగళగిరిలో టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్సు నుంచి లోకేష్ కిందకు దిగిన సమయంలో డ్రోన్ ఆయన ముందు పడిపోయింది. 

మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ కి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఓ డ్రోన్ కెమెరా విద్యుత్ వైర్లకు తగిలి లోకేష్ ముందు పడిపోయింది. ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే.. అది లోకేష్ మీద పడి ఉండేది. లోకేష్ బస్సు దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆపరేటింగ్ లోపం కారణంగానే డ్రోన్ కిందపడినట్లు తెలుస్తోంది. 

ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ మంగళగిరిలో టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్సు నుంచి లోకేష్ కిందకు దిగిన సమయంలో డ్రోన్ ఆయన ముందు పడిపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఒక్క అడుగు ముందుకు పడినా ఆ డ్రోన్ ఆయన మీద పడేది. కాగా, టీడీపీ నిరసన కార్యక్రమాన్ని డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరిస్తున్నారు. ఆపరేటింగ్ లోపం కారణంగా ఆ డ్రోన్ విద్యుత్ వైర్లకు తగిలి కింద పడిపోయిందని భద్రతా సిబ్బంది తెలిపారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!