మీ తుగ్లక్ చర్య వల్లే పోలవరం ఇలా... వైసీపీపై లోకేష్ విసుర్లు

By telugu teamFirst Published Aug 3, 2019, 11:39 AM IST
Highlights

ఈ పోలవరం విషయాన్ని ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో ప్రస్తావించగా.. కేంద్ర మంత్రి స్పందించి.. అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా టెండర్లు మార్చడం వల్ల పోలవరం ఖర్చు ఎక్కువ అవుతుందని కూడా పేర్కొన్నారు. ఈ సందర్భంగా లోకేష్... జగన్ ప్రభుత్వానిది తుగ్లక్ చర్యగా పేర్కొంటూ విమర్శలు చేయడం గమనార్హం.

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్... ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఇటవల ఏపీ ముఖ్యమంత్రి జగన్... పోలవరం ప్రాజెక్టు నుంచి నవయుగ కంపెనీని వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలా చేయడం వల్ల పోలవరం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అన్నారు.

ఈ విషయంపై శనివారం మంత్రి లోకేష్ స్పందించారు. ‘ తుగ్లక్ గారు ఉన్నారా? విన్నారా? అంటూ పోలవరం టెండర్లపై లోకేష్ ట్వీట్ చేశారు. ‘‘ పోలవరం టెండర్లు రద్దు చేయడం బాధాకరం. మీ తుగ్లక్ చర్య వల్ల ప్రాజెక్టు ఆలస్యం అవుతుంది. ఖర్చు కూడా పెరుగుతుంది అని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ గారు లోక్ సభలో చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో 2600 కోట్ల అవినీతి జరిగిపోయింది అంటూ తలతిక్క లెక్కలు చెబుతున్న మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి ఒక లెక్క ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ, కేంద్ర జలసంఘం, కేంద్ర జలవనరులశాఖ, సిడబ్ల్యుసి, కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించిన తర్వాతే నాబార్డ్ నిధులు విడుదల చేస్తుంది. ఇన్ని కేంద్ర వ్యవస్థలకు కనిపించని అవినీతి మీకు కనిపించింది. రివర్స్ టెండరింగ్ అంటే ఆంధ్రుల జీవనాడి పోలవరానికి టెండర్ పెట్టడమని అర్థమయింది’’ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

కాగా... ఈ పోలవరం విషయాన్ని ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో ప్రస్తావించగా.. కేంద్ర మంత్రి స్పందించి.. అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా టెండర్లు మార్చడం వల్ల పోలవరం ఖర్చు ఎక్కువ అవుతుందని కూడా పేర్కొన్నారు. ఈ సందర్భంగా లోకేష్... జగన్ ప్రభుత్వానిది తుగ్లక్ చర్యగా పేర్కొంటూ విమర్శలు చేయడం గమనార్హం.

click me!