హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు

Published : Aug 03, 2019, 09:46 AM IST
హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు

సారాంశం

 వైద్య పరీక్షల నిమిత్తం గత శనివారం ఆయన తన సతీమణి భువనేశ్వరితో కలిసి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.  

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు.  వైద్య పరీక్షల నిమిత్తం గత శనివారం ఆయన తన సతీమణి భువనేశ్వరితో కలిసి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.

కాగా... మిన్నెసోటా రాష్ట్రంలోని మేయో క్లినిక్‌లో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. తిరిగి వచ్చే రోజు ఆయన తనను కలవడానికి వచ్చిన కొందరు ప్రవాసాంధ్రులతో కలిసి ఉల్లాసంగా గడిపారు. మొక్కజొన్న పేలాలు తింటూ స్థానిక వీధుల్లో సరదాగా నడిచారు. కాసేపు షాపింగ్‌ చేశారు. రెస్టారెంట్లో వారితో కలిసి రాజకీయాలు, ఇతర అంశాలు మాట్లాడారు. ఆయనకు వీడ్కోలు పలికిన వారిలో తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి, సతీశ్‌ వేమన, రామ్‌ చౌదరి తదితరులు ఉన్నారు

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు