పెళ్లిరోజు... భార్యపై ప్రేమ కురిపించిన లోకేష్, అభిమానులు ఫిదా

Published : Aug 26, 2019, 02:54 PM IST
పెళ్లిరోజు... భార్యపై ప్రేమ కురిపించిన లోకేష్, అభిమానులు ఫిదా

సారాంశం

ఇది చూసిన అభిమానులు వీరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘మీ ఆనందమైన ఈ జీవితం చిరకాలం సుఖ సంతోషాలతో సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.. పెళ్లి రోజు శుభాకాంక్షలు’.. ‘అన్న, వదినకు పెళ్లిరోజు శుభాకాంక్షలు’.. ‘హ్యాపీ వెడ్డింగ్‌ యానివర్సరీ’.. అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దంపతులు సోమవారం తమ 12వ పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా లోకేష్.. తన భార్య బ్రహ్మణికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.  అంతేకాకుండా తనకు తన భార్య ఉన్న ప్రేమను కూడా ఈ సందర్భంగా లోకేష్ వివరించారు. ఆయన తన భార్యపై చూపించిన ప్రేమకు టీడీపీ అభిమానులు ఫిదా అయిపోయారు.

‘12ఏళ్లు.. 144 నెలలు.. 4,383రోజులు, 1,05,192 గంటలు, 63,11,520 నిమిషాలు.. ఇన్ని రోజుల్లో నిన్ను ప్రేమించకుండా ఉండని క్షణం లేదు.. నా హృదయం లోపలి నుంచి నిన్ను ప్రేమిస్తున్నా.. పెళ్లి రోజు శుభాకాంక్షలు బ్రాహ్మణి నారా’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

 ఇది చూసిన అభిమానులు వీరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘మీ ఆనందమైన ఈ జీవితం చిరకాలం సుఖ సంతోషాలతో సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.. పెళ్లి రోజు శుభాకాంక్షలు’.. ‘అన్న, వదినకు పెళ్లిరోజు శుభాకాంక్షలు’.. ‘హ్యాపీ వెడ్డింగ్‌ యానివర్సరీ’.. అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. 2007లో వివాహబంధంతో ఒక్కటైన వీరికి కుమారుడు దేవాన్ష్‌ ఉన్నాడు.

 

PREV
click me!

Recommended Stories

టీడీపీ నాయకుడు లాడ్జికి ఎందుకు వెళ్లాడు?: Kakani Govardan Reddy | Asianet News Telugu
హాస్టల్ వార్డెన్ కు సన్మానించినAPFood Commission Chairman Chitha Vijay Prathap | Asianet News Telugu