కారులో నోట్లకట్టలు.. జగన్ కి ఆ దమ్ముందా లోకేష్ విమర్శలు

By telugu news teamFirst Published Jul 16, 2020, 11:50 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి రవాణా చేస్తున్నారని ఆరంబాక్కం పోలీసులకు సమాచారం అందింది. దాంతో బుధవారం తెల్లవారు డామున ఎలాపూరులోని చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేశారు.

 తమిళనాడులోని గుమ్మిడిపూండి సమీపంలో ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న కారులో తలిస్తున్న రూ.5.27 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.  కాగా.. ఈ ఘటనపై టీడీపీ యువ నేత, మాజీ మంత్రి నారా లోకేష్.. ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు.

‘‘జగన్ గారి సాండ్,ల్యాండ్, వైన్ తమిళనాడు లో దొరికిపోయింది. మంత్రి అనుచరులు, మంత్రి స్టిక్కర్ ఉన్న కారులో 5.27 కోట్లు తరలిస్తూ పట్టుబడ్డారు.ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న డబ్బుల కట్టలు చూస్తే యుశ్రారైకాపా ఎమ్మెల్యేల దోపిడీ ఏ రేంజ్ లో ఉందొ అర్థం అవుతుంది.’’ అంటూ లోకేష్ ట్విట్టర్ లో మండిపడ్డారు.

‘‘ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న మద్యాన్ని పట్టుకొని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వానికి పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న అక్రమ సొమ్ముని పట్టుకునే దమ్ముందా?’’ అంటూ లోకేష్ ప్రశ్నించారు.

కాగా..  తమిళనాడులోని గుమ్మిడిపూండి సమీపంలో ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న కారులో తలిస్తున్న రూ.5.27 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారుకు ఉన్న స్టిక్కర్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిదని తొలుత భావించారు. కానీ ఆ స్టిక్కర్ ఆంధ్రప్రదేశ్ అన్నం బాబూరావుదని వార్తలు వస్తున్నాయి. 

కారులో పట్టుబడిన నగదుపై చెన్నైలోని ఐటీ కార్యాలయంలో విచారణ జరుగుతోంది. నగదు పట్టుబడిన కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు కూడా ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందినవారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి రవాణా చేస్తున్నారని ఆరంబాక్కం పోలీసులకు సమాచారం అందింది. 

దాంతో బుధవారం తెల్లవారు డామున ఎలాపూరులోని చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేశారు. ఆ తనిఖీల్లో భాగంగా ఎమ్మెల్యే స్కిక్కర్ ఉన్న కారును ఆపీ సోదా చేశారు. దాంతో వారికి కారు వెనక సీటులో నాలుగు సంచుల్లో రూ.5.27 కోట్ల రూపాయలు వారికి చిక్కాయి. 

ఒంగోలుకు చెందిన నాగరాజ్, వసంత్, కారు డ్రైవర్ సత్యనారాయణలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఇద్దరు పరారైనట్లు భావిస్తున్నారు. నగదును ఆదాయం పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. కారు మాత్రం కోయంబత్తూరుకు చెందిన సెంట్రల్ ఆర్టీవో పరిధిలోని వి. రామచంద్రన్ పేరు మీద ఉన్నట్లు తేలింది.


 

click me!