టీడీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ కన్నుమూత

Siva Kodati |  
Published : Jul 28, 2022, 06:03 PM IST
టీడీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ కన్నుమూత

సారాంశం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ కన్నుమూశారు. తాడికొండ నుంచి టీడీపీ టికెట్‌పై మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పుష్పరాజ్. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడుల కేబినెట్‌లలో మంత్రిగా సైతం పనిచేశారు. 

ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచినట్లు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. తాడికొండ నుంచి టీడీపీ టికెట్‌పై మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పుష్పరాజ్. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడుల కేబినెట్‌లలో మంత్రిగా సైతం పనిచేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే వున్న ఆయన పలు కీలక పదవులు నిర్వర్తించారు. ఆయన మరణం పట్ల టీడీపీ నేతలు, అభిమానులు సంతాపం తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?