చంద్రబాబుకి మరో షాక్.... బీజేపీలోకి గంటా

By telugu team  |  First Published Nov 8, 2019, 7:14 AM IST

గురువారం ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ను కలిసి కీలక మంతనాలు జరిపారు. గంటాతో పాటు ఎంతమంది బీజేపీలో చేరతారన్న విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ వారు బీజేపీతో చేతులు కలిపితే అనర్హత వేటు పడడం, ఇతర న్యాయపరమైన అంశాల గురించి వారు చర్చలు జరిపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 


ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకి మరో షాక్ తగలనుంది. మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత గంటా శ్రీనివాసరావు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో వెళ్లేందుకు ఆయన తన మార్గం సుగుమం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గంటాతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గురువారం ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ను కలిసి కీలక మంతనాలు జరిపారు. గంటాతో పాటు ఎంతమంది బీజేపీలో చేరతారన్న విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ వారు బీజేపీతో చేతులు కలిపితే అనర్హత వేటు పడడం, ఇతర న్యాయపరమైన అంశాల గురించి వారు చర్చలు జరిపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న గంటా సుజనా, సీఎం రమేశ్‌తో కూడా చర్చలు జరిపారు.

Latest Videos

undefined

ఇదిలా ఉండగా.... ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు టీడీపీ ని వీడారు. టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని పార్టీకి రాజీనామా చేశారు. ఆమె ఈ నెల 10వ తేదీన బిజెపిలో చేరే అవకాశాలున్నాయి. తన రాజీనామా లేఖను ఆమె చంద్రబాబుకు పంపించారు.

సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీకి పలువురు నేతలు రాజీనామా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, సాధినేని యామిని కూడా రాజీనామా చేశారు. జూపల్లి ప్రభాకర్ రావు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం కావాలని చూస్తున్న బిజెపి టీడీపీ, ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తోంది. పలువురు టీడీపీ నాయకులు ఇంకా బిజెపి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కూడా బిజెపి వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని ఎదుర్కోవడంలో సాధినేని యామిని కీలక పాత్ర పోషించారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీపై విమర్శలు కురిపిస్తూ వచ్చారు. గత కొంత కాలంగా మౌనం వహించారు.

click me!