మాజీ మంత్రి గంటా అనుచరుడు మృతి

Published : Jul 25, 2020, 10:50 AM IST
మాజీ మంత్రి గంటా అనుచరుడు మృతి

సారాంశం

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ నలంద కిశోర్ ను మూడు వారాల క్రితం కర్నూలు సీఐడీ పోలీసులు అర్థరాత్రి అదుపులో తీసుకున్నారు. విశాఖ నుంచి కర్నూలుకు రోడ్డు మార్గంలో తరలించి అక్కడ విచారించి వదిలేశారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్(65) మృతి చెందారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. కాగా... సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ నలంద కిశోర్ ను మూడు వారాల క్రితం కర్నూలు సీఐడీ పోలీసులు అర్థరాత్రి అదుపులో తీసుకున్నారు. విశాఖ నుంచి కర్నూలుకు రోడ్డు మార్గంలో తరలించి అక్కడ విచారించి వదిలేశారు.

కాగా.. ఈ ఘటన చోటుచేసుకున్న కొద్ది రోజులకే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కిశోర్ మృతి పట్ల గంటా శ్రీనివాసరావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu