సీఎం, మంత్రులకు మమ్మల్ని తిట్టడమే పని.. జగన్ ప్రభుత్వంపై దేవినేని విమర్శలు

Published : Aug 14, 2019, 12:49 PM IST
సీఎం, మంత్రులకు మమ్మల్ని తిట్టడమే పని.. జగన్ ప్రభుత్వంపై దేవినేని విమర్శలు

సారాంశం

వైఎస్ హెలికాప్టర్ కనిపించకుండా పోయిన సమయంలోనే పోలవరం పవర్ ప్రాజెక్టు కోసం జగన్ చేరసారాలు చేశారని ఈ సందర్భంగా దేవినేని గుర్తు చేశారు.  జగన్ బంధువు పీటర్ ఇచ్చిన తప్పుడు నివేధికలతో మేధావులు, నిపుణుల నిర్ణయాలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వ విధానాలపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మండిపడ్డారు. తాను పట్టిన కుందేలుకి మూడేకాళ్లు అన్నరీతిలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందిన ఆయన విమర్శించారు. బుధవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ముఖ్యమంత్రికి, మంత్రులకు ప్రతిపక్ష నేతలను తిట్టడమే పని అని... తమను తిడుతూ వాళ్లు కాలయాపన చేస్తున్నారని దేవినేని మండిపడ్డారు. వైఎస్ హెలికాప్టర్ కనిపించకుండా పోయిన సమయంలోనే పోలవరం పవర్ ప్రాజెక్టు కోసం జగన్ చేరసారాలు చేశారని ఈ సందర్భంగా దేవినేని గుర్తు చేశారు.  జగన్ బంధువు పీటర్ ఇచ్చిన తప్పుడు నివేధికలతో మేధావులు, నిపుణుల నిర్ణయాలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

పీటర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ విధానాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ తప్పుపట్టిందన్నారు. కాపర్ డ్యామ్ నిర్మాణం వల్ల ఒక మండలం మునిగిపోయిందనది మంత్రి అనడం.. ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ఆయన అన్నారు. టెండర్ల రద్దు ఆషామాషీ వ్యవహారం కాదని పోలవరం అథారిటీ గట్టిగా చెప్పందన్నారు.

డ్యామ్ భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తే.. ప్రభుత్వం వద్ద సమాధానం లేకుండా పోయిందన్నారు. వైసీపీ నేతల తాపేదార్లకు ప్రాజెక్టును కట్టబెట్టేందుకే పోలవరం పనులను ఆపించేశారని ఉమా ఆరోపించారు. గోదావరి నీటిని తెలంగాణకు తీసుకుపోయి పక్క రాష్ట్రంలో కమిషన్ లు కొట్టేద్దాం అని ఆలోచిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దోచుకోవడంపై తప్ప.. సంక్షేమంపై సీఎంకు చిత్తశుద్ధి లేదన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!