జగన్ పోలవరంలో కన్నా.. కాళేళ్వరంలో ఎక్కువ గడిపారు... దేవినేని

Published : Jun 22, 2019, 10:17 AM IST
జగన్ పోలవరంలో కన్నా.. కాళేళ్వరంలో ఎక్కువ గడిపారు... దేవినేని

సారాంశం

ఏపీ సీఎం జగన్ పోలవరంలో కన్నా... కాళేశ్వరంలోనే ఎక్కువ సేపు గడిపారని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం జగన్ పై విమర్శల వర్షం కురిపించారు.

ఏపీ సీఎం జగన్ పోలవరంలో కన్నా... కాళేశ్వరంలోనే ఎక్కువ సేపు గడిపారని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం జగన్ పై విమర్శల వర్షం కురిపించారు.

కర్నూలు జలదీక్షలో జగన్ మాట్లాడిన మాటలు అందరూ చూశారని ఆయన అన్నారు.  పోలవరంపై జగన్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్.. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదని దేవినేని అన్నారు.

పోలవరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని ఆయన అన్నారు. ఇంజినీరింగ్‌ నిపుణుల కమిటీ సూచన మేరకే కాపర్‌ డ్యాం నిర్మాణం చేపట్టామన్నారు. పోలవరంపై సీఎం జగన్‌ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. నిబంధనల మేరకే పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.

 60 శాతం అప్పర్‌ కాపర్‌ డ్యాం పూర్తయిందని పేర్కొన్నారు. పోలవరం నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మా మీద కోపంతో పనులను నిర్లక్ష్యం చేయొద్దని కోరారు.

PREV
click me!

Recommended Stories

3వ రోజు కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి స్పీచ్ | Nara Bhuvaneswari Visits Horticulture Hub in Kuppam
ప్రపంచ స్థాయి ఫెసిలిటీస్‌తో భోగాపురం ఎయిర్‌పోర్ట్ | Alluri Sitarama Raju International Airport