ఏవీ సుబ్బారెడ్డిపై దాడి.. ఆధారాలతో మీడియా ముందుకొస్తా : అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 25, 2023, 03:03 PM IST
ఏవీ సుబ్బారెడ్డిపై దాడి.. ఆధారాలతో మీడియా ముందుకొస్తా : అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ఏవీ సుబ్బారెడ్డిపై దాడికి సంబంధించి తాను అన్ని ఆధారాలతో త్వరలోనే మీడియా ముందుకు వస్తానన్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. మహిళపై దాడి చేయడమే కాకుండా.. మళ్లీ ఆడపిల్లపై కేసు పెట్టి స్టేషన్‌ చుట్టూ తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   

ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళపై దాడి చేయడమే కాకుండా.. మళ్లీ ఆడపిల్లపై కేసు పెట్టి స్టేషన్‌ చుట్టూ తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్కృతిని తాను ఎక్కడా చూడలేదన్నారు. తన మీద కేసు పెపట్టాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించారని అఖిలప్రియ ఆరోపించారు. తన పరిస్ధితే ఇలా వుంటే రాష్ట్రంలో వున్న మహిళ పరిస్ధితి ఏ విధంగా వుందో అర్ధమవుతుందన్నారు. దాడి ఘటనకు సంబంధించి.. తాను త్వరలోనే ఆధారాలతో సహా మీడియా ముందుకు వస్తానని అఖిల ప్రియ స్పష్టం చేశారు. 

ALso Read: ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం: మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్

కాగా.. నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర ఈ నెల 16న నంద్యాల నియోజకవర్గానికి చేరుకుంది. ఈ సందర్భంగా కొత్తపల్లి వద్ద నారా లోకేష్‌కు స్వాగతం పలికేందుకు గాను భూమి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి తన మద్ధతుదారులతో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఇరువర్గాలకు మధ్య వాగ్వాదం నడిచింది. ఇదే సమయంలో అఖిలప్రియ వర్గీయులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు సుబ్బారెడ్డిని కారులో వెనక్కి పంపారు. దీనిపై సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అఖిలప్రియ సహా మరికొందరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌లను కర్నూలు సబ్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో వీరికి బుధవారం కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu