ఆ ఆరోపణలు నిరూపిస్తే నా ఆస్తులు రాసిస్తా.. మాజీ మంత్రి బాలినేని

Published : Apr 23, 2023, 01:12 PM ISTUpdated : Apr 23, 2023, 01:50 PM IST
ఆ ఆరోపణలు నిరూపిస్తే నా ఆస్తులు రాసిస్తా.. మాజీ మంత్రి బాలినేని

సారాంశం

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో తాను పెట్టుబడులు పెట్టానని వస్తున్న ఆరోపణలను మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. 

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో తాను పెట్టుబడులు పెట్టానని వస్తున్న ఆరోపణలను మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. మైత్రీ మూవీస్‌లో తాను పెట్టుబడులు పెట్టానని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. తనకు ఇండస్ట్రీలో స్నేహితులు ఉన్నారని.. అయితే సినిమాల్లో పెట్టుబడి పెట్టారని ఆరోపించడం సరికాదన్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌లో తాను గానీ, తన వియ్యంకుడు గానీ పెట్టుబడులు పెట్టినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. తమ ఆస్తులు మొత్తం రాసిస్తానని కామెంట్ చేశారు. 

వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సహకరిస్తే మైత్రీ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్టా అని ప్రశ్నించారు. వీరసింహారెడ్డి చిత్రానికే కాదు ఏ సినిమాకైనా అవసరం అయితే తాను సహకరిస్తానని చెప్పారు.  మైత్రీ సంస్థలో పెట్టుబడులున్నాయో? లేదో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దర్యాప్తు చేసుకోవచ్చని చెప్పారు. జనసేన కార్పొరేటర్ చేసిన ఆరోపణలపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని అన్నారు. 


మైత్రి మూవి మేకర్స్ లో పెట్టుబడులు పెట్టిన ప్రజాప్రతినిధిని వదిలేసి తనను టార్గెట్ చేయడం వెనుకు ఏదో కుట్ర ఉందని అనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. తమపై చేస్తున్న దుష్ప్రచారం మానుకోవాలని సూచించారు. మైత్రీ మూవీ మేకర్స్‌లో బాలినేనికి పెట్టుబడులున్నాయని విశాఖపట్నం జనసేన కార్పొరేటర్‌ మూర్తి ఆరోపించిన విషయం తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu