ఫ్రెండ్లీ పోలీసింగ్ కు ప్రాధాన్యత:చినరాజప్ప

By Nagaraju TFirst Published Oct 4, 2018, 2:34 PM IST
Highlights

 ప్రజలతో పోలీసులు ఫ్రెండ్లీగా నడుచుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం హోంమంత్రి చినరాజప్ప పోలీసులకు సూచించారు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన చినరాజప్ప నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. 

నెల్లూరు: ప్రజలతో పోలీసులు ఫ్రెండ్లీగా నడుచుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం హోంమంత్రి చినరాజప్ప పోలీసులకు సూచించారు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన చినరాజప్ప నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. 

విడవలూరు, నెల్లూరు నగరంలో రెండు పోలీస్ స్టేషన్లను చినరాజప్ప ప్రారంభించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను పటిష్టపరచాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారన్నారు. 

అందులో భాగంగానే అధునాతన టెక్నాలజీతో కూడిన పోలీస్ స్టేషన్లను నిర్మించడం జరుగుతుందన్నారు. మోడల్ పోలీస్ స్టేషన్లను నిర్మిస్తున్నట్లు చినరాజప్ప తెలిపారు. నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగలో పోలీస్ శాఖ అద్భుతంగా ప్రజలకు సేవలందించిందని చినరాజప్ప ప్రశంసించారు.  
 

click me!