ఏవోబీలో అలజడి: పోలీసులు-మావోల మధ్యఎదురుకాల్పులు

By Nagaraju TFirst Published Sep 27, 2018, 9:12 PM IST
Highlights

ఆంధ్ర-ఒడిషా సరిహద్దు ప్రాంతం ఏవోబీ మళ్లీ ఉలిక్కిపడింది. మావోయిస్టులు పోలీసుల మధ్య ఎదురుకాల్పులతో ఏజెన్సీ ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళ్తే ఒడిస్సా రాష్ట్రం కోరాపుట్‌ జిల్లా కుడుబు వద్ద మావోయిస్టులు పోలీసుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. 

విశాఖపట్నం : ఆంధ్ర-ఒడిషా సరిహద్దు ప్రాంతం ఏవోబీ మళ్లీ ఉలిక్కిపడింది. మావోయిస్టులు పోలీసుల మధ్య ఎదురుకాల్పులతో ఏజెన్సీ ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళ్తే ఒడిస్సా రాష్ట్రం కోరాపుట్‌ జిల్లా కుడుబు వద్ద మావోయిస్టులు పోలీసుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్లో సుమారు 30 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం.  

గత ఆదివారం అరకులో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలపై మావోయిస్టులు కాల్పులు జరిపి అత్యంత దారుణంగా హతమార్చారు. దీంతో అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్ ఘడ్, ఒడిస్సా పోలీసులు ఏజెన్సీని జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా మావోయిస్టులకు ప్రధాన అవాసంగా ఉన్న ఏవోబీలో అణువణువు భద్రతా బలగాలు తనిఖీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుడుబు వద్ద మావోయిస్టులు, పోలీసులు ఎదురుకావడంతో ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం. 

మరోవైపు అరకులో సీఎం చంద్రబాబు నాయడు శుక్రవారం పర్యటించే అవకాశం ఉన్న నేపథ్యంలో మావోల అలజడిపై పోలీస్ శాఖ తలలు పట్టుకుంటుంది. ఎదురుకాల్పులు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటనపై ఆచితూచి స్పందిస్తున్నారు. 
 

click me!