హరికృష్ణ విగ్రహం రెడీ....జయంతిన జూ.ఎన్టీఆర్ కు అందజేత

Published : Sep 01, 2018, 01:32 PM ISTUpdated : Sep 09, 2018, 01:48 PM IST
హరికృష్ణ విగ్రహం రెడీ....జయంతిన జూ.ఎన్టీఆర్ కు అందజేత

సారాంశం

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ విగ్రహాం సిద్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరానికి చెందిన ఏకేఆర్ట్స్ శిల్పులు డాక్టర్ పెనుగొండ అరుణ్ ప్రసాద్ ఉడయార్, కరుణాకర్ ఉడయార్‌లు హరికృష్ణ మీద అభిమానంతో విగ్రహాన్ని రూపొందించారు.

ఏలూరు: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ విగ్రహాం సిద్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరానికి చెందిన ఏకేఆర్ట్స్ శిల్పులు డాక్టర్ పెనుగొండ అరుణ్ ప్రసాద్ ఉడయార్, కరుణాకర్ ఉడయార్‌లు హరికృష్ణ మీద అభిమానంతో విగ్రహాన్ని రూపొందించారు. 

అచ్చం హరికృష్ణను మరిపించేలా విగ్రహాన్ని రూపొందించారు. హరికృష్ణలో ఉట్టిపడే రాజసం విగ్రహంలో కనబడేలా తయారు చేసినట్లు శిల్పులు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 2 హరికృష్ణ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆయన చిన్న కుమారుడు సినీహీరో జూనియర్ ఎన్టీఆర్ కు అందజేయనున్నట్లు శిల్పులు అరుణ్ ప్రసాద్ ఉడయార్ తెలిపారు

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!