గ్రామాలపై ఏనుగుల దాడులు..ఆందోళనల్లో జనాలు

First Published Jan 13, 2018, 11:53 AM IST
Highlights
  • జిల్లాలోని మెలియాపుట్టి మండలం జోడూరు పంచాయతీలో ఏనుగులు భయానక వాతావరణం సృష్టించాయి.

జిల్లాలోని మెలియాపుట్టి మండలం జోడూరు పంచాయతీలో ఏనుగులు భయానక వాతావరణం సృష్టించాయి. కొద్దిరోజులుగా గాదిలోవ గ్రామ సమీపంలోని కొండపై తిష్టవేసిన ఏనుగులు ఒక్కసారిగా గ్రామాలపై పడ్డాయి. పొలసరి, రాజాపురం గ్రామాల్లో తిష్టవేసిన ఏనుగుల గుంపు ప్రజలకు భయాందోళనలు కలిగిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. గతంలో చాలాసార్లు ఏనుగులు గ్రామాలపై పడి నానా బీభత్సవం సృష్టించాయి.

ఏనుగుల సమస్యను జనాలు అటవీశాఖ అధికారులకు చెప్పుకుంటున్నా పెద్దగా ఉపయోగం కనిపించటం లేదు.  ఏనుగుల సమస్య నుండి జనాలకు విముక్తి కలిగించాలని అటవీశాక అధికారులు కొంత ప్రయత్నం చేసినా ఉపయోగం కనబడలేదు. దాంతో అధికారులు పట్టించుకోవటం లేదు. ఇదే అదేనుగా ఏనుగులు ఎప్పటికప్పుడు గ్రామాలపైన పడుతున్నాయి. పంటలను నాశనం చేసేస్తున్నాయి. గ్రామాలపైకి దాడి చేసినపుడు కొందరు మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి అధికారులు చొరవ తీసుకుని ఏనుగులు గ్రామాల వైపు రాకుండా చూడాలని స్థానికులు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు.

click me!