విద్యుత్ ఛార్జీలు పెంచలేదు: ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి

Published : Apr 12, 2021, 05:26 PM IST
విద్యుత్ ఛార్జీలు పెంచలేదు: ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి

సారాంశం

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని ఏపీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

ఒంగోలు: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని ఏపీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.సోమవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.కొత్త టారిఫ్ లో కరూడా పాత ఛార్జీలే వసూలు చేస్తామని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ పై కక్ష సాధించాల్సిన అవసరం తమకు లేదని ఆయన చెప్పారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉద్దేశ్యపూర్వకంగానే పవన్ కళ్యాణ్ సీనిమాకు టికెట్ రేట్లు పెంచకుండా అడ్డుకొన్నారనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. భవిఫ్యత్తులో ఏ హీరో సినిమా విడుదలైనా కూడ  టికెట్ ధరలు పెంచుకొనేందుకు అవకాశం ఇవ్వమని ఆయన తెలిపారు.పవన్ కళ్యాణ్ నటించిన  వకీల్ సాబ్ సినిమా ఈ నెల 9న విడుదలైంది. అయితే ఈ సినిమా బెనిఫిట్ షో లు రద్దయ్యాయి. ఈ షోలు రద్దు చేయడంపై బీజేపీ సహా పలు పార్టీల నేతలు ఏపీ సర్కార్ తీరుపై మండిపడ్డారు.అయితే పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తాము బెనిఫిట్ షో రద్దు  చేశామన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్