
విశాఖపట్నం/ తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే యువతిని పెళ్లి చేసుకోవడానికి అన్నదమ్ములిద్దరు ఆసక్తి చూపారు. దీంతో సోదరుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. యువతి అన్నకు బదులుగా తమ్ముడ్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది.
తమ్ముడు ఎల్లయ్యకు యువతితో పెళ్లి నిశ్చయమైంది. దీంతో అన్న రాజు అతనిపై తీవ్రమైన ఆగ్రహం పెంచుకున్నాడు. తమ్ముడ్ని అన్న రాజు హత్య చేశాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలోని పూడిమడకలో చోటు చేసుకుంది.
ఇదిలావుంటే, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అకాల వర్షం కారణంగా విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. బైక్ మీద వెళ్తున్న భార్యాభర్తలపై ఈదురుగాలికి టెలిఫోన్ టవర్ కూలింది. ఈ సంఘటనలో భర్త అక్కడికక్కడే మరణించాడు. భార్య తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. మృతుడిని హోంగార్డు సతీష్ గా గుర్తించారు.
గత మూడు రోజులుగా జిల్లాలో ఎండల మండిపోతున్నాయి. అకస్మాత్తుగా సోమవారం ఈదురుగాలులు విచాయి. ఈ ఈదురు గాలులకు టెలిఫోన్ టవర్ కూలింది.