ఎనిమిదేళ్ల చిన్నారిపై బ్లేడుతో దాడి.. మెడకోసి, గంజాయి మత్తులో యువకుడి వీరంగం..

Published : Feb 24, 2023, 06:49 AM IST
ఎనిమిదేళ్ల చిన్నారిపై బ్లేడుతో దాడి.. మెడకోసి, గంజాయి మత్తులో యువకుడి వీరంగం..

సారాంశం

గంజాయి మత్తులో ఓ వ్యక్తి ఎనిమిదేళ్ల బాలికపై బ్లేడుతో దాడి చేసి మెడ కోశాడు. ప్రస్తుతం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ఓ విషాద ఘటన జరిగింది. గంజాయి మత్తులో ఉన్న ఓ వ్యక్తి దాడిలో ఓ చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. గంజాయి తీసుకున్న మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని అయోమయంలో ఓ యువకుడు.. తనతో ఎలాంటి సంబంధం లేని ఓ చిన్నారి గొంతు కోశాడు. గురువారం నాడు ఈ  దారుణ ఘటన  వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే..  కావలిలోని వెంగళరావు నగర్ లో ఉన్న పొట్టి శ్రీరాములు పురపాలక పాఠశాలలో ఆ చిన్నారి రెండో తరగతి చదువుకుంటుంది.  తన పేరు చోడహవ్యశ్రీప్రియ(8). 

గురువారం సాయంత్రం హవ్యశ్రీ స్కూల్ నుంచి రోజులాగే ఇంటికి వస్తోంది. అదే ప్రాంతంలో నిందితుడు షేక్ ఖాదర్బాషా ఉంటారు. అతను గంజాయి  వ్యసనానికి బానిసయ్యాడు. ఆరోజు కూడా గంజాయి మత్తులో ఉన్నాడు. అదే సమయంలో బాలిక స్కూల్ నుంచి వస్తూ కనిపించింది. గంజాయి మత్తులో బాలికపై బ్లేడ్ తో దాడి చేశాడు. గొంతు మీద కోయడంతో కొంత భాగం తెగింది. అతడి నుంచి తప్పించుకున్న బాలిక పరుగు పరుగున ఇంటికి చేరుకుంది. బాలిక వెంటే పరుగులు పెడుతూ వచ్చిన యువకుడు.. వారి ఇంటికి వచ్చి.. బాలిక గొంతు కోసిందని తానేనని చెప్పాడు. 

కడప జిల్లాలో విషాదం: విద్యుత్ షాక్‌తో ఇద్దరు చిన్నారుల మృతి

బాలిక ఇంటి బయట కాసేపు హల్చల్ చేశాడు.  దీంతో స్థానికులు  కొద్దిసేపు భయాందోళనలు నెలకొన్నాయి. చివరికి చిన్నారి తల్లిదండ్రులు ఎలాగో బాలికతో ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకోగలిగారు. అక్కడ బాలికకు చికిత్స అందించారు. ఆ తర్వాత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. హవ్యశ్రీపై దాడి చేసిన ఖాదర్బాషాను అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు అతని తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారిస్తున్నట్లుగా కావలి సిఐ కే శ్రీనివాస్ తెలిపారు. 

ఇదిలా ఉండగా, హైదరాబాద్ లోని తిరుమలగిరిలో నిరుడు సెప్టెంబర్ లో ఇలాంటి దారుణ ఘటనే చోటు చేసుకుంది. తిరుమలగిరిలోని మడ్‌ఫోర్ట్‌లో 40 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. దేవమ్మ అనే ఆ మహిళ గొంతు కోసి హత్య చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు తిరుమల్ గిరి పోలీసులు తెలిపారు. అయితే, మృతురాలి ఒంటిమీద చెవిపోగులు కనిపించకపోవడంతో.. డబ్బుల కోసం హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆ రోజు ఉదయం రక్తపు మడుగులో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది హత్య అని నిర్ధారించిన పోలీసులు ముందుగా బాధితుడిని గుర్తించే పని మొదలుపెట్టారు. ఆమె ఫోటోను స్థానికంగా ఉన్న కాలనీల్లో పంచిపెట్టారు. దీని ద్వారా మృతురాలి గుర్తింపును తెలుసుకున్నారు. దేవమ్మ మద్యం మత్తులో ఉన్నప్పుడే హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. ఆ

మె చివరిసారిగా ఎవరితో కనిపించిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె చివరిగా ఏ కల్లు దుకాణానికి వెళ్ళింది.. ఆమె మీద లైంగిక వేధింపులు జరిగాయో లేదో తెలియాలంటే పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. దేవమ్మ స్వస్థలం వనపర్తి జిల్లా. నెలరోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చి దినసరి కూలీగా పనిచేస్తోంది. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం