ఏపీలో కరోనాతో 8 మంది విద్యుత్ ఉద్యోగులు మృతి... !

By AN Telugu  |  First Published May 1, 2021, 9:29 AM IST

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకూ కరోనా బారినపడి చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులు కరోనాకు బలి అవతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. 


ఆంధ్రప్రదేశ్ లో కరోనా కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకూ కరోనా బారినపడి చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులు కరోనాకు బలి అవతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. 

అమరావతి, గుంటూరు సర్కిల్లో కరోనా బారినపడి 8మంది విద్యుత్ ఉద్యోగులు మృతి చెందారు. కరోనా టెస్టుల్లో 124మంది  విద్యుత్ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో విద్యుత్ ఉద్యోగులు, కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.

Latest Videos

తమను ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా గుర్తించాలని, కనీసం ఉద్యోగులకు వ్యాక్సినేషన్ అయినా ఇవ్వాలని విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కోరలు చాస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారీ కేసులు 17 వేల మార్క్‌‌ను దాటాయి. దీంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు పలు చోట్ల మినీ లాక్‌డౌన్ విధించగా, ప్రస్తుతం రాష్ట్రం మొత్తం నైట్ కర్ఫ్యూ అమల్లో వుంది.

అయినప్పటికీ ఫలితాలు మాత్రం ఆశించిన రీతిలో రావడం లేదు. తాజాగా గురువారం ఒక్క రోజే కొత్తగా 17,354 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 11,01,690కి చేరుకుంది.

గురువారం ఒక్కరోజు కోవిడ్ వల్ల 64 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో వైరస్ సోకి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7,992కి చేరింది. గత 24 గంటల్లో నెల్లూరు 8, విశాఖపట్నం 8,  విజయనగరం 7, చిత్తూరు 6, తూర్పుగోదావరి 6, ప్రకాశం 6, అనంతపురం 5, గుంటూరు 4, కర్నూలు 4, పశ్చిమ గోదావరి 4, కృష్ణ 3, శ్రీకాకుళంలలో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

click me!