MLC Elections: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా.. అందరి దృష్టి నాగబాబుపైనే

Published : Mar 03, 2025, 02:46 PM ISTUpdated : Mar 03, 2025, 02:47 PM IST
MLC Elections: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా.. అందరి దృష్టి నాగబాబుపైనే

సారాంశం

ఆంధ్రప్రదేతో పాటు తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారో మోగింది. తాజాగా గ్రాడ్యుయేట్‌, టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితలు వెలువడుతోన్న తరుణంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ మరో కీలక నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం ఎన్ని స్థానాలు భర్తీ చేయనున్నారు.? అందరి దృష్టి నాగబాబుపై ఎందుకు పడిందన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

ఆంధ్రప్రదేతో పాటు తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారో మోగింది. తాజాగా గ్రాడ్యుయేట్‌, టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితలు వెలువడుతోన్న తరుణంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ మరో కీలక నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం ఎన్ని స్థానాలు భర్తీ చేయనున్నారు.? అందరి దృష్టి నాగబాబుపై ఎందుకు పడిందన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

గ్రాడ్యుయేట్ ఎమ్మల్సీ, టీచర్‌ ఎమ్మెల్సీ ఫలితాలు ఇంకా పూర్తి స్థాయిలో రాకముందే మరో ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 5, తెలంగాణలో 5 కలిపి మొత్తం 10 స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 

ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ఇదే.. 

* మార్చ్ 3 ఎన్నికల నోటిఫికేషన్ జారీ 

* నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా మార్చ్ 10ని నిర్ణయించారు. 

*మార్చ్‌ 11వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపడుతారు. 

* మార్చ్ 13వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువుగా నిర్ణయించారు. 

* మార్చ్ 20వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. 

* అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. రాత్రిలోపు ఫలితా వచ్చేస్తాయి. 

వీరి పదవీకాలం ముగుస్తుండడమే కారణం.

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పదివీలో ఉన్న కొందరు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. మార్చ్‌ 29వ తేదీతో ఆంధ్రప్రదేశ్‌లో బీటీ నాయుడు, అశోక్‌ బాబు, యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావుతో పాటు తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా హసన్ ఎఫెండీల పదవీకాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. 

ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది.? 

శాసన సభలో పార్టీలకు ఉండే సంఖ్యా బలం ఆధారంగానే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆధారపడి ఉంటాయని తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైసీపీ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో పెద్దగా పోటీ ఉండే అవకాశం లేదు. మొత్తం ఐదు స్థానాలు కూటమి పార్టీలకే దక్కనున్నాయి. తాజా సమాచారం ప్రకారం మొత్తం 5 సీట్లలో మూడు టీడీపీ, జనసేన, బీజేపీలకు చేరో ఒక స్థానం దక్కే అవకాశం ఉంది. అదే తెలంగాణ విషయానికొస్తే అధికార కాంగ్రెస్‌ పార్టీకి 4 స్థానాలు, బీఆర్‌ఎస్‌కు ఒక సీటు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అందరి దృష్టి నాగబాబు పైనే.. 

ఇదిలా ఉంటే పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకు ఒక సీటు కేటాయిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో అందరి దృష్టి జనసేన నేత నాగబాబుపై పడింది. నిజానికి నాగబాబు లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ సీటు కోసం ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో వీలుకాకపోవడంతో ఆ స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే నాగబాబును రాజ్యసభకు పంపాలని చంద్రబాబు భావించారని, కానీ నాగబాబు అందుకు విముఖత వ్యక్తం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 

రాష్ట్ర క్యాబినేట్‌లో చేరేందుకే నాగబాబు ఆసక్తికనబరిచారని సమాచారం. ఇందులో భాగంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు అవకాశం ఇచ్చి. మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో నాగబాబుకు ఏ శాఖ ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. 

వర్మకి అవకాశం దక్కేనా.? 

అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీట్లను త్యాగం చేసిన వారిలో పిఠాపురం వర్మ ఒకరు. చివరి క్షణం వరకు ఈ సీటు వర్మదే అనుకున్నారు. కానీ అనూహ్యంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీలో నిలబడ్డారు. అయితే తొలుత దీనిని వ్యతిరేకించినా తర్వాత చంద్రబాబు నచ్చజెప్పడంతో వర్మ, పవన్‌కు మద్ధతు ఇచ్చారు. ప్రచారంలో చాలా యాక్టివ్‌గా పాల్గొన్నారు. అధికారంలోకి రాగాని తొలి ఎమ్మెల్సీ పోస్టు నీకే ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో వర్మకు ఒక స్థానం పక్కా అనే చర్చ నడుస్తోంది. అయితే ఇటీవల వర్మ ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ అయిన ఓ వీడియో చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. 

పోటీలో మరికొందరు?

ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ స్థానాల కోసం టీడీపీలో మరికొందరు నాయకులు సైతం పోటీలో ఉన్నారు. పిఠాపురం నేత వర్మతో పాటు మాజీమంత్రులు జవహర్, దేవినేని ఉమా, వంగవీటి రాధ, రెడ్డి సుబ్రహ్మణ్యం, గన్ని వీరాంజనేయులు, తిప్పేస్వామి, నల్లపాటి రాము, ప్రభాకర్ చౌదరి, కొమ్మాలపాటి శ్రీధర్ తదితరులు పోటీపడుతున్నారు. మరి చంద్రబాబు ఎవరికీ అవకాశం ఇస్తారన్నదని ఇప్పుడు ఆసక్తిగా మారింది. 

బీజేపీ నుంచి ఎవరికి అవకాశం రానుంది.? 

ఇక బీజేపీకి కూడా ఒక స్థానాన్ని కేటాయించనున్నారు. బీజేపీ నుంచి మాధవ్‌ పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై బీజేపీ అధిష్టానం నుంచి ఇలాంటి ఎలాంటి స్పష్టత రాలేదు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే