
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కె.విజయానంద్‌ను నియమించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఈవో ఆర్పీ సిసోడియాను కేంద్ర ఎన్నికల సంఘం ఆకస్మికంగా బదిలీ చేసి ఆ స్థానంలో ద్వివేదిని నియమించింది. కాగా విజయానంద్ ప్రస్తుతం ఏపీ జెన్‌కో సీఎండీగా ఉన్నారు.