భూకంపం నష్టం రూ. 3లక్షల కోట్లు

First Published Nov 17, 2017, 8:32 PM IST
Highlights
  • ఇరాన్-ఇరాక్ సరిహద్దు ప్రాంతంలో ఇటీవలే సంభవించిన భూకంపం భారీ నష్టాన్నే మిగిల్చింది.

ఇరాన్-ఇరాక్ సరిహద్దు ప్రాంతంలో ఇటీవలే సంభవించిన భూకంపం భారీ నష్టాన్నే మిగిల్చింది. ఆదివారం రాత్రి ఇరాన్-ఇరాక్ సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం అందరికీ తెలిసిందే. భూకంపం ధాటికి దాదాపు 500 వందల మంది ప్రాణాలు కోల్పోగా.. 10వేల మంది వరకు గాయపడ్డారు. లక్షలాది మంది తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. కెర్మాన్షాహ్ ప్రావిన్స్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

భూకంపం కారణంగా ఇరాన్-ఇరాక్ సరిహద్దు ప్రాంతం శవాల గుట్టగా మారిపోయింది. భవన శిథిలాలే శవపేటికలుగా మారాయి. ఎక్కడికక్కడ భవనాలు కుప్పకూలిపోయి రహదారులన్నీ శిథిలాలుగా మారిపోయాయి. నిరాశ్రయులైన వారికి అక్కడి ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. ఈ భూకంపం వల్ల కలిగిన నష్టం సుమారు 5 బిలియన్ యూరోలు, అంటే భారత కరెన్సీలో రూ.3లక్షల కోట్లని ఓ అంచనా.

 

click me!