ఆ పార్టీకి ఓటేస్తే తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టినట్లే

Published : Oct 03, 2018, 04:37 PM IST
ఆ పార్టీకి ఓటేస్తే తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టినట్లే

సారాంశం

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. వైసీపీ నేతలు టీడీపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని విమమర్శించారు. ఐక్య రాజ్య సమితిలో చంద్రబాబు ప్రసంగించడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు.

కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. వైసీపీ నేతలు టీడీపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని విమమర్శించారు. ఐక్య రాజ్య సమితిలో చంద్రబాబు ప్రసంగించడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. సహచర ఎమ్మెల్యేను మావోయిస్టులు హత్య చేస్తే జగన్‌ పరామర్శించడానికి రాలేదని ఆరోపించారు. 

తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడుని పదేపదే విమర్శిస్తున్న వైసీపీ నేతలకు కేంద్రాన్ని, మోదీని ప్రశ్నించే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. మోదీని ప్రశ్నించే దమ్ము వైసీపీ నేతలకు లేదని ఎద్దేవా చేశారు. 

వైసీపీకి అధికారం కట్టబెడితే తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టినట్లేనని వ్యాఖ్యానించారు. నాడు దివంగత సీఎం ఎన్టీఆర్‌, నేడు చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారని కేఈ స్పష్టం చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్