తలసాని వ్యాఖ్యలు: తప్పుబడుతున్న దుర్గగుడి పాలకమండలి

Published : Jan 14, 2019, 06:22 PM IST
తలసాని వ్యాఖ్యలు: తప్పుబడుతున్న దుర్గగుడి పాలకమండలి

సారాంశం

తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్  విజయవాడలోని దుర్గమ్మ గుడి సన్నిధిలో  చేసిన రాజకీయ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

విజయవాడ:  తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్  విజయవాడలోని దుర్గమ్మ గుడి సన్నిధిలో  చేసిన రాజకీయ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆలయ ఆవరణలో  రాజకీయాలు మాట్లాడడాన్ని ఆలయ పాలకమండలి తప్పుబడుతోంది.

సంక్రాంతి పర్వదినం సందర్భంగా  ఏపీలో  టీఆర్ఎస్ ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం నాడు పర్యటించారు. ఈ సందర్భంగా దుర్గమ్మ గుడి సన్నిదిలో మీడియాతో మాట్లాడిన సమయంలో  తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ వ్యాఖ్యలు చేశారు.

దుర్గమ్మ సన్నిధిలో రాజకీయాలను తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడడాన్ని ఆయన దుర్గ గుడి పాలకమండలి తప్పుబడుతోంది. తలసాని శ్రీనివాస్ యాదవ్   దుర్గమ్మ సన్నిధిలో  రాజకీయాలు మాట్లాడుతున్న ఆలయ సిబ్బంది వారించకపోవడాన్ని పాలకమండలి తప్పుబడుతోంది.

దుర్గమ్మ సన్నిధిలో  తలసాని శ్రీనివాస్ యాదవ్  రాజకీయాలు మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలని పాలకమండలి డిమాండ్ చేస్తోంది.తలసాని శ్రీనివాస్ యాదవ్  వ్యవహారాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లనున్నట్టు పాలకమండలి సభ్యులు  చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

పవన్ వ్యాఖ్యలపై తలసాని స్పందన ఇదీ

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్